e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News యురేనియం కార్పొరేష‌న్‌లో మైనింగ్ మేట్ పోస్టులు

యురేనియం కార్పొరేష‌న్‌లో మైనింగ్ మేట్ పోస్టులు

యురేనియం కార్పొరేష‌న్‌లో మైనింగ్ మేట్ పోస్టులు

న్యూఢిల్లీ: ప్ర‌భుత్వ‌రంగ సంస్థ, కేంద్ర అణుశ‌క్తి శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్‌) మైనింగ్ మేట్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 51 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌వారిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియ‌మించ‌నుంది.
మొత్తం పోస్టులు: 51
అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు డీజీఎంఎస్‌ జారీ చేసిన మెటాలిఫెరస్‌ మైన్స్‌ మైనింగ్‌ మేట్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ ఉండాలి. హిందీ లేదా స్థానిక భాష రాయడం, చదవడం వ‌చ్చి ఉండాలి. 2021, ఏప్రిల్ 30 నాటికి 35 ఏండ్లు మించకూడ‌దు.
ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్ ద్వారా
దరఖాస్తు ప్ర‌క్రియ‌: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు స్పీడ్ పోస్టులో పంపించాలి.
అడ్ర‌స్‌: office of General Manager(I/P&IRs/CP),
Uranium Corporation of India Limited,
PO: Jaduguda Mines,
Dist: East Singhbhum,
Jharkhand – 832 102
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10
వెబ్‌సైట్‌: www.ucil.gov.in

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యురేనియం కార్పొరేష‌న్‌లో మైనింగ్ మేట్ పోస్టులు

ట్రెండింగ్‌

Advertisement