గురువారం 09 జూలై 2020
Nipuna-education - Jun 01, 2020 , 08:34:31

జూలై 5న ఎల్పీసెట్‌.. జూన్‌ 9వ దరఖాస్తులు

జూలై 5న ఎల్పీసెట్‌.. జూన్‌ 9వ దరఖాస్తులు

హైదరాబాద్‌: ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే లేటరల్‌ ఎంట్రీ ఫర్‌ పాలిటెక్నిట్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎల్పీసెట్‌)ను జూలై 5 నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల గడువును జూలై 9 వరకు పొడిగించింది. అదేవిధంగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తులను జూన్‌ 9 వరకు సమర్పించవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుముతో జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రవేశ పరీక్ష జూలై 1న జరగనుంది. 


logo