శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 20, 2020 , 07:31:26

వచ్చేనెల 4న డీఈఈసెట్

వచ్చేనెల 4న డీఈఈసెట్

హైద‌రా‌బాద్: డీఎడ్‌, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్‌ ఎడ్యు‌కే‌షన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే డీఈఈసెట్ తేదీని పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను అక్టో‌బర్‌ 4న నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్లు వెల్ల‌డించింది. ఈ ఆన్‌లైన్‌ ప‌రీక్ష‌లు రెండు విడ‌త‌ల్లో జ‌రుగుతాయ‌ని తెలిపింది. ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు తెలుగు మీడియంవారికి, మధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియం విద్యా‌ర్థు‌లకు పరీక్ష ఉంటుంద‌ని పేర్కొంది.


logo