బుధవారం 25 నవంబర్ 2020
Nipuna-education - Oct 30, 2020 , 13:21:53

సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు

సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులు

న్యూఢిల్లీ: ‌కేంద్ర ప్ర‌భుత్వరంగ సంస్థ సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ఫ్యూయెల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) ధ‌న్‌బాద్‌లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి సీఎస్ఐఆర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అనుభ‌వం క‌లిగినవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 23 పోస్టుల‌ను భ‌ర్తీచేస్తున్న‌ది. ఉద్యోగం పొందిన‌వారు ధ‌న్‌బాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.  

మొత్తం పోస్టులు: 23

ఇందులో మైనింగ్ ఇంజినీరింగ్‌-9, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌-3, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌-3, ఎల‌క్ట్రానిక్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌-3, సివిల్ ఇంజినీరింగ్‌-2, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్-2, మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌-1 ఖాళీ చొప్పున ఉన్నాయి. 

అర్హ‌తలు: బీటెక్‌లో మైనింగ్, కెమిక‌ల్, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌, సివిల్, ఎన్విరాన్‌మెంట‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజినీరింగ్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 2   

వెబ్‌సైట్‌: https://cimfr.nic.in