న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోపియేట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని నాలుగేండ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు.
మొత్తం పోస్టులు: 90
ఇందులో ప్రొఫెసర్ 4, అడిషనల్ ప్రొఫెసర్ 2, అసోపియేట్ ప్రొఫెసర్ 6, అసిస్టెంట్ ప్రొఫెసర్ 14, కన్సల్టెంట్ 7, సీనియర్ రెసిడెంట్ 11, సీనియర్ ఫెలో 1, అసిస్టెంట్ ల్యాబ్ మేనేజర్ 1, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ 1, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ 9, నర్స్ 9, ఆపరేషన్స్ హెడ్ 1, మేనేజర్ 3, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 2, ఎగ్జిక్యూటివ్ 2, ఫ్లోర్ కోఆర్డినేటర్ 5, న్యూట్రిషనిస్ట్ 3, ఫ్లోర్ కోఆర్డినేటర్ 5, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ 2 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 20
వెబ్సైట్: https://www.ilbs.in/