హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తుల ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ఐటీ ఆఫీసర్, టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 18
ఇందులో రిజిస్ట్రార్ 1, నాన్ టీచింగ్ 17 ఖాళీలు ఉన్నాయి. ఫ్యాకల్టీ పోస్టుల సంఖ్యను పేర్కొనలేదు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 4
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: https://www.iipe.ac.in/careers