ఆదివారం 07 జూన్ 2020
Nipuna-education - Apr 03, 2020 , 12:20:30

ఇంటినుంచే టోఫెల్‌, జీఆర్‌ఈ పరీక్షలు

ఇంటినుంచే టోఫెల్‌, జీఆర్‌ఈ పరీక్షలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నిలువరించడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో గ్లోబల్‌ ఎగ్జామ్స్‌ అయిన టోఫెల్‌, జీఆర్‌ఈలను విద్యార్థులు ఇంటినుంచే రాయవచ్చని ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో విద్యార్థులకు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని టోఫెల్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ గోపాల్‌ తెలిపారు. కరోనా అధికంగా ప్రబలిన చైనా, ఇరాన్‌ దేశాల్లో మినహా మిగతా దేశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. 


logo