వ్యవసాయ యూనివర్సిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ఆన్లైన్ శిక్షణ అనివార్యంగా మారింది. ఆన్లైన్ విద్యాబోధనలో సాంకేతికతను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై జూన్ 1 నుంచి 30 వరకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్) ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నది. ఉపాధ్యాయులు, బోధనపై ఆసక్తి ఉన్నవారు, అధ్యాపకులు https://ele arning.naarm.org.in లింక్ ద్వారా మే 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.