గురువారం 26 నవంబర్ 2020
Nipuna-education - Oct 31, 2020 , 13:25:19

ఎస్సెస్సీ ఎంటీఎస్ టైర్‌-2 ఫ‌లితాల విడుద‌ల‌

ఎస్సెస్సీ ఎంటీఎస్ టైర్‌-2 ఫ‌లితాల విడుద‌ల‌

న్యూఢిల్లీ: మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్ టైర్‌-2 ఫలితాల‌ను స్టాఫ్‌సెలెక్ష‌న్ క‌మిష‌న్ (ఎస్సెస్సీ) విడుద‌ల చేసింది. ఎస్సెస్సీ ఎంపీఎస్‌-2019 పేప‌ర్ 2 ప‌రీక్ష రాసిన‌వారు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో చూసుకోవాల‌ని ప్ర‌క‌టించింది. గ‌తేడాది న‌వంబ‌ర్ 26న నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌కు దేశ‌వ్యాప్తంగా 96748 మంది హాజ‌ర‌య్యారు. మార్కుల వివ‌రాల‌ను వ‌చ్చే నెల 5న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నుంది. 

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ప్రాంతీయ కార్యాల‌యాల్లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ నిర్వ‌హిస్తారు. త్వ‌రలో ఈ తేదీల‌ను వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కేంద్ర‌ప్ర‌భుత్వంలోని వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల్లో గ్రూప్ సీ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియ‌ల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.