శుక్రవారం 27 నవంబర్ 2020
Nipuna-education - Oct 28, 2020 , 18:53:00

యూకో బ్యాంక్‌లో స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్లు

యూకో బ్యాంక్‌లో స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్లు

న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వ‌రంగ బ్యాంక్ అయిన యూకో బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న స్పెష‌లిస్ట్‌ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ స్కేల్‌-1, 2 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది ఆఖ‌రు లేదా వ‌చ్చే ఏడాది మొద‌టి నెల‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ది. 

పోస్టుల సంఖ్య‌: 91

ఇందులో చార్ట‌ర్డ్ అకౌంటెట్లు లేదా సీఎఫ్ఏ-50, ఐటీ ఆఫీస‌ర్‌-20, సెక్యూరిటీ ఆఫీస‌ర్‌-9, ఇంజినీర్లు-8, స్టాటిస్టీషియ‌న్‌-2, ఎక‌న‌మిస్ట్‌-2 పోస్టుల చొప్పున ఉన్నాయి. ప‌రీక్ష తేదీ నాటికి పోస్టుల సంఖ్యలో హెచ్చుత‌గ్గులు ఉండే అవ‌కాశం ఉన్న‌ది. 

అర్హ‌త‌: సెక్యూరిటీ ఆఫీస‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి, ఇంజినీర్స్ పోస్టుల‌కు సివిల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఆర్కిటెక్ట్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి, స్టాటిస్టీషియ‌న్ పోస్టుల‌కు ఎక‌న‌మిక్స్ లేదా ఎక‌నామెట్రిక్ స్టాటిస్టిక్స్‌లో పీజీ చేయాలి, ఐటీ ఆఫీస‌ర్‌కు కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీ క‌మ్యూనికేష‌న్‌లో బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. సీఎఫ్ఏ పోస్టుల‌కు సీఏ లేదా సీఎఫ్ఏ చేసి ఉండాలి, ఎక‌న‌మిస్ట్ పోస్టుల‌కు ఎక‌నమిక్స్‌లో పీజీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అదేవిధంగా అక్టోబ‌ర్ 1 నాటికి 21 నుంచి 30 ఏండ్లలోపు (సెక్యూరిటీ ఆఫీస‌ర్‌కు 40 ఏండ్ల లోపు) వ‌య‌స్సు క‌లిగి ఉండాలి. 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామ్‌, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 17

రాత‌ప‌రీక్ష: ఈ ఏడాది డిసెంబ‌ర్ లేదా 2021 జ‌న‌వ‌రిలో 

వెబ్‌సైట్‌: ucobank.com.