ఇబ్రహీంపట్నం రూరల్ : ’స్మార్ట్ ప్రిపరేషన్’ పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో మేలుచేసే విధానం. ఈ స్మార్ట్ప్రిపరేషన్కు రోజురోజుకు ఎంతో ఆదరణ పెరుగుతుంది. వేలరూపాయల ఖర్చు, రోజుల కొద్ది సమయం వృథాకాకుండా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కావల్సిన సబ్జెక్టులను నిమిషాల్లో తీసుకోవచ్చు. ఒకప్పుడు నోటిఫికేషన్ విడుదల అయిననాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు ఒక అభ్యర్థి ప్రతి సమాచారం కోసం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. నోటిఫికేషన్ విడుదల అయితే ఎన్ని పోస్టులు, ఆఖరి గడువు, అర్హతలు, ఇతర సమాచారం కోసం పత్రికల్లో వెతికే పరిస్థితి కనిపించేది.
కొన్ని ఉద్యోగాల సమాచారం కూడా క్షేత్రస్థాయికి వచ్చేవికావు. దాని తర్వాత పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి గంటలకొద్ది సమయం, చదవడానికి కావల్సిన పుస్తకాల సేకరణ, వేల రూపాయల ఖర్చులుండేవి. పరీక్ష అనంతరం ఫలితాల కోసం వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నోటిఫికేషన్ విడుదలైన నిమిషాల్లోనే మనకున్న స్టడీయాప్స్ ద్వారా సమాచారం అందుతున్నది. అందుకు దరఖాస్తు కూడా నిమిషాల్లో పూర్తవుతుంది. దరఖాస్తు అనంతరం పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలి? ముఖ్యమైన అంశాలు, టైమ్‌టేబుల్, తదితర సూచలన్నీ నిపుణులు ఈ యాప్స్ ద్వారా మనకు రోజు అందిస్తూ ఉన్నారు. వీటి ద్వారా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడం కోసం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
కావల్సినన్నీ ఎడ్యుకేషన్ ఆప్లికేషన్లు
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో విషయ పరిజ్ఞానం అవసరం. కరెంట్ ఆఫైర్స్పై ఎంతో పట్టుండాలి. అప్పుడే సక్సెస్‌ను అందుకోగలరు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా పుస్తకాలు కొనుక్కొని చదుకోవటం కొన్నిసార్లు వీలుపడదు. కరెంట్ ఆఫైర్స్ ఎల్లప్పుడు మారుతూనే ఉంటాయి. వీటి కోసం అందుబాటులో ఉన్న ఆప్లికేషన్లను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే రిక్రూట్మెంట్, ఎస్ఎస్ఎస్సీ తదితర వాటిద్వారా నియమించే అన్ని ఉద్యోగాలకు నేడు ఆప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో జీకేఇండియా, మనపీఎస్సీ, కౌటిల్యకెరీర్స్, బైజూస్, మ్రూనాల్, అన్అకాడమీ, బ్యాంకర్స్అడ్డా, ఎస్ఎస్ఎస్సీ అడ్డా, గ్రేడ్అప్, టాప్‌ర్యాంకర్స్, ఐప్రూవ్స్టడీబడ్డీ, డైలీహంట్లాంటి అనేక ఆప్లికేషన్ల ద్వారా ఆయా పరీక్షల్లో రాణించాలనుకునే అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ ఆప్లికేషన్ల ద్వారా టీఎస్పిఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ తదితర పరీక్షల స్టడీమెటీరియళ్లు పొందవచ్చు. పోటీపరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టులూ ఇందులో అందుబాటులో ఉంటాయి. బుక్‌మార్క్, ఫాంట్సైజ్, కలర్, తదితర అన్ని రకాల ఫీచర్లతో ఇవి పనిచేస్తున్నాయి.
‘మనటీవీ’తో విద్యార్థులకెంతో మేలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే, పాఠశాల, కళాశాలల, వృత్తివిద్యా కోర్సు కోసం ప్రవేశ పరీక్ష, తదితర పరీక్షలకు సంబంధించి నాణ్యమైన శిక్షణ అందించేందుకు మారుమూల పల్లెలకు సైతం ‘మనటీవీ’ ప్రసారాలను అందజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని పోటీపరీక్షలే కాకుండా, దేశవ్యాప్తంగా యేటా క్యాలెండర్ ప్రకారం వచ్చే యూపీఎస్సీ, స్టాఫ్‌సెలక్షన్ కమీషన్, ఐబీపీఎస్, రైల్వే, సరిహద్దు భద్రతాదళం తదితర సంస్థల్లోని ఉద్యోగాల పోటీపరీక్షలకు తెలంగాణ యువతరం పోటీపడేలా మనటీవీ ద్వారా నిరంతరం అనుభవజ్ఞులైన అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగ పరీక్షలే కాకుండా ఐఐటీ, క్యాట్, ఎంసెట్, నీట్.. తదితర పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. మన టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే తరగతులను నేడు గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఎంతో ఉపయోగించుకుంటున్నారు.
స్టడీసర్కిళ్ల కంటే ఆన్లైన్ తరగతులకే ప్రాధాన్యత
డబ్బులుండి కొందరు.. లేకున్నా అప్పులు చేసి మరికొందరు నగరంలోని ప్రైవేట్ స్టడీ సర్కిళ్లలో చేరి లక్షల రూపాయలు ఖర్చు చేసుకునేవారు. కాని మారుతున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఇంటి వద్ద ఉంటూనే పోటీపరీక్షలకు, ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు టీవీ ముందు కూర్చుని సమయం వృథా చేసుకుంటున్నారనే తల్లిదండ్రులు నేడు అదే టీవీ ముందు కూర్చోబెట్టి మరీ తమ పిల్లలను చదువుకోమ్మని చెబుతున్నారు. ప్రిపరేషన్లో భాగంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కంప్యూటర్, ఫోన్లలో ఇంటర్నెట్ సహాయంతో మాక్టెస్ట్ల లాంటివి కూడా రాస్తున్నారు. మొత్తం మీద విద్యార్థులు సాంకేతికత సహాయంతో స్మార్ట్ ప్రిపరేషన్‌కు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు.
ఆన్లైన్ తరగతుల ద్వారా ఎంతో మేలుజరుగుతుంది
– మహేష్, గ్రూప్స్ అభ్యర్థి
గతంలో ప్రైవేటు స్టడీసర్కిళ్లల్లో వేల రూపాయల ఖర్చు చేసి శిక్షణ తీసుకునేవాళ్లము. నాలుగు నెలలపాటు ఇచ్చే ఈ శిక్షణలో వేలాది మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తుండటంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. కాని నేడు ఆన్లైన్ తరగతులు, ప్రత్యేక ఆప్లికేషన్ల ద్వారా చదువుకునేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రిపేరవుతుంటే ప్రపంచంలోని సమాచారమంతా మనదగ్గరే ఉన్నట్లుగా ఉంది.