న్యూఢిల్లీ: రక్షణశాఖ పరిధిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నిర్ణీత నమూనాలో అప్లికేషన్ ఫామ్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 47
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఎర్త్‌సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డైరీ మైక్రోబయాలజీ, జూలజీ, బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 25
వెబ్సైట్: http://barc.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి