బుధవారం 12 ఆగస్టు 2020
Nipuna-education - Jul 16, 2020 , 19:44:16

ఆ అంశాల‌ను ప్ర‌యోగ అభ్య‌స‌న‌కు ఉప‌యోగించ‌వచ్చు: CBSE

ఆ అంశాల‌ను ప్ర‌యోగ అభ్య‌స‌న‌కు ఉప‌యోగించ‌వచ్చు: CBSE

న్యూఢిల్లీ: ‌సెంట్ర‌ల్ బోర్డు ఫ‌ర్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (CBSE) సిల‌బ‌స్ నుంచి తొల‌గించిన అంశాల‌ను ప్ర‌యోగ అభ్య‌స‌న‌కు, ప్రాజెక్టు ఆధారిత అభ్య‌స‌న‌కు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది. 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సంబంధించిన‌ సిల‌బ‌స్ నుంచి 30 శాతం టాపిక్స్‌ను గ‌త వారం CBSE తొల‌గించింది. తొల‌గించిన అంశాలు ఆయా త‌ర‌గ‌తుల ఫైన‌ల్ ప‌రీక్ష‌ల్లోగానీ, ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల్లోగానీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోబ‌డ‌వ‌ని బోర్డు స్ప‌ష్టంచేసింది. 

అయితే, ఏదైనా పాఠ‌శాల‌లో ఇటీవ‌ల తొల‌గించిన అంశాల‌ను ఇప్ప‌టికే బోధించే ఉంటే మాత్రం ఆయా అంశాల‌ను ప్ర‌యోగ అభ్య‌స‌న‌కు, ప్రాజెక్టు ఆధారిత అభ్య‌స‌న‌కు ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని CBSE క్లారిటీ ఇచ్చింది. 2020-21 విద్యాసంవ‌త్స‌రం ఇంట‌ర్న‌ల్ ప‌రీక్ష‌ల్లో ఆయా అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్న‌ట్లు బోర్డు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo