గురువారం 01 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 15, 2020 , 12:25:07

నీరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

నీరీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు

హైదరాబాద్‌: ‌హైద‌రాబాద్‌లోని తార్నాక కేంద్రంగా ప‌నిచేస్తున్న నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరీ) వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తికి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆవ్వానిస్తున్న‌ది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. దర‌ఖాస్తుల‌ను ఈనెల 24వ తేదీలోపు పంపించాల‌ని వెల్ల‌డించింది. 

మొత్తం పోస్టులు: 10

ఇందులో ప‌్రాజెక్టు అసిస్టెంట్-8 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1- 2 పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌లు: ప‌్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల‌కు బీఎస్సీ బాట‌నీ లేదా జువాల‌జీ లేదా బ‌యోటెక్నాల‌జీ లేదా కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ లేదా ఎన్విరాన్‌మెంట్ సైన్స్ లేదా జియాల‌జీ లేదా అగ్రిక‌ల్చ‌ర్ కోర్సులో ఉత్తీర్ణు‌లై ఉండాలి. 50 ఏండ్ల వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టుల‌కు ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌, ఇంజినీరింగ్ లేదా ఎన్విరాన్‌మెంట్ బ‌యోటెక్నాల‌జీ లేదా కెమిస్ట్రీ లేదా అన‌లిటిక‌ల్ కెమిస్ట్రీ లేదా మెట‌ల‌ర్జీ లేదా అట్మాస్పియ‌రిక్ సైన్సెస్ లేదా మెరైన్ సైన్సెస్ లేదా కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ లేదా అగ్రిక‌ల్చ‌ర్ స‌బ్జెక్టుల‌తో ఎమ్మెస్సీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తిచేసి ఉండాలి. 35 ఏండ్ల లోపువారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసిన బ‌యోడేటాను ఈ-మెయిల్ [email protected]కు పంపించాలి. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 24  

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్ www.neeri.res.in 


logo