న్యూఢిల్లీ: పాము పేరు ఎత్తగానే చాలా మంది భయంతో వణికిపోతారు. అయితే కొందరు మాత్రం ఎంతో ధైర్యంగా వాటిని పట్టుకోవడంతోపాటు ఆడిస్తుంటారు. శ్వేతా అనే బాలిక ఎంతో ధైర్యంగా పామును పట్టుకున్నది. అంతేగాక ఒక కర్ర సాయంతో దానితో విన్యాసాలు చేయించింది. కాస్త భయంగొల్పే ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయింది.
స్నేక్ లవర్ అయిన శ్వేత పాములు పట్టుకోవడం తన హామీ అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నది. గతంలోనూ పాములను పట్టుకుని వాటితో దిగిన వీడియోలను ఇందులో పోస్ట్ చేస్తూ పాపురల్ అయింది. మరోవైపు ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చిన్న వయసులోనే పాములను ఈజీగా పట్టుకోవడంతోపాటు వాటితో ఆమె ఆడుతున్న వీడియోలను లైక్ చేయడంతో పాటు ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ కామెంట్లు కూడా చేశారు.
https://www.instagram.com/p/COVz_TzgS4_/?utm_source=ig_web_copy_link