శనివారం 27 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 28, 2021 , 13:21:51

పీఎన్‌బీలో సెక్యూరిటీ మేనేజర్‌ పోస్టులు

పీఎన్‌బీలో సెక్యూరిటీ మేనేజర్‌ పోస్టులు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ సెక్యూరిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీఎన్‌బీ కోరింది. వచ్చే నెల 13 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 

మొత్తం పోస్టులు: 100

ఇందులో జనరల్‌ 40, ఈడబ్ల్యూఎస్‌ 10, ఓబీసీ 27, ఎస్సీ 15, ఎస్టీ అభ్యర్థులకు 8 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గెజిటెడ్‌ పోలీస్‌ లేదా కమిషన్డ్‌ సర్వీస్‌లో ఐదేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూలో భాగంగా ఎస్సే రైటింగ్‌ లేదా లెటర్‌ డ్రాఫ్టింగ్‌‌ పరీక్షను నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్‌ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 13

వెబ్‌సైట్‌: pnbindia.in

VIDEOS

logo