గురువారం 04 మార్చి 2021
Nipuna-education - Jan 21, 2021 , 07:45:44

మారిన ఓయూ డిస్టెన్స్‌ పరీక్షల తేదీలు

మారిన ఓయూ డిస్టెన్స్‌ పరీక్షల తేదీలు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రొఫె‌సర్‌ జీ రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యు‌కే‌షన్‌ (పీ‌జీ‌ఆ‌ర్‌‌ఆ‌ర్‌‌సీ‌డీఈ) పీజీ కోర్సుల పరీక్ష తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవ‌త్సరం మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలు షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి రెండు నుంచి జరగాల్సి ఉన్నాయి. అయితే వాటిని వారం రోజులపాటు వాయిదావేశారు. దీంతో ఫిబ్రవరి 10 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనిప్రకారం.. 

ఫిబ్రవరి 10న (బుధవారం)- పేపర్‌-1

ఫిబ్రవరి 11న (గురువారం)- పేపర్‌-2

ఫిబ్రవరి 12న (శుక్రవారం)- పేపర్‌-3

ఫిబ్రవరి 13న (శనివారం)- పేపర్‌-4

ఫిబ్రవరి 15న (సోమవారం)- పేపర్‌-5/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ పేపర్‌-1 ప్రాక్టికల్స్

ఫిబ్రవరి 16న (మంగళవారం)- పేపర్‌-6/ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ పేపర్‌-2 ప్రాక్టికల్స్

పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు నిర్వహిస్తారు. 

VIDEOS

logo