e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) భారీగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పీజీ డిప్లొమా, ఐటీఐ చేసిన వారు అప్రెంటిస్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1110 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్‌ రీజియన్‌లో 76 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చే నెల 20వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 1110
ఇందులో సౌథర్న్‌ రీజియన్‌-1 హైదరాబాద్‌ 76, సౌథర్న్‌ రీజియన్‌-2 బెంగళూరు 114, కార్పొరేట్‌ సెంటర్‌ (గురుగ్రామ్‌) 44, నార్తర్న్‌ రీజియన్‌ 313, ఈస్టర్న్‌ రీజియన్‌ 156, నార్తీస్టర్న్‌ రీజియన్‌ 127, ఒడిశా ప్రాజెక్ట్‌ 53, వెస్టర్న్‌ రీజియన్‌ 227 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఐటీఐ అప్రెంటిస్‌ కోసం ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, డిప్లొమా అప్రెంటిస్‌ కోసం సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ కోసం బీఈ, బీటెడ్‌, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: సంబంధిత కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా
స్టయిఫండ్‌: ప్రతి నెల రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఇస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జూలై 21
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20
వెబ్‌సైట్‌: https://www.powergridindia.com/

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు
పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 అప్రెంటిస్‌లు

ట్రెండింగ్‌

Advertisement