శుక్రవారం 05 మార్చి 2021
Nipuna-education - Feb 22, 2021 , 08:16:37

ఐపీఈలో పీజీ‌డీఎం కోర్సులు.. 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

ఐపీఈలో పీజీ‌డీఎం కోర్సులు.. 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

హైద‌రా‌బాద్‌: ది ఇన్‌‌స్టి‌ట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంట‌ర్‌‌ప్రై‌జ్‌లో (ఐ‌పీఈ) రెండేండ్ల కాల వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ మేనే‌జ్‌‌మెంట్‌ (పీ‌జీ‌డీఎం) కోర్సుల్లో ప్రవే‌శా‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగినవారు దర‌ఖా‌స్తు చేసుకోవాల‌ని ఐపీఈ డైరె‌క్టర్‌ ప్రొఫె‌సర్‌ నాథన్‌ సుబ్ర‌హ్మ‌ణి‌యన్ సూచించారు. 2021 – 23 సంవ‌త్స‌రా‌నికిగాను ఈ నెల 28తో  దర‌ఖా‌స్తుల గడువు ముగి‌య‌నుంది. క్యాట్‌, మ్యాట్‌, ఎక్స్‌‌ఏటీ, సీఎం‌ఏటీ, ఏటీ‌ఎంఏ, జీమ్యాట్‌ స్కోర్‌ ఆధా‌రంగా పీజీడీఎం కోర్సులో ప్రవే‌శాలు కల్పించ‌నున్నారు. ఇతర వివ‌రాల కోసం www.ipeindia.org వెబ్‌‌సై‌ట్‌‌తో‌పాటు, 93919 32129, 91547 09139 నంబ‌ర్లను  సంప్ర‌దిం‌చ వ‌చ్చ‌ని తెలిపారు.

VIDEOS

logo