గురువారం 03 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 09, 2020 , 09:02:03

ఈనెల 20 నుంచి ఓయూ డిగ్రీ పరీ‌క్షలు

ఈనెల 20 నుంచి ఓయూ డిగ్రీ పరీ‌క్షలు

హైద‌రాబాద్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని డిగ్రీ కోర్సుల సెమి‌స్టర్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేర‌కు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేసింది. టైంటేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్ ouexams.inలో చూడ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు ఇప్ప‌టికే పూర్తిచేశారు. అదేవిధంగా దూర‌విద్యా కేంద్ర‌మైన పీజీ‌ఆ‌ర్‌‌ఆ‌ర్‌‌సీ‌డీఈ పరి‌ధి‌లోని అన్ని పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల పరీ‌క్షలు వచ్చే‌నెల 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పీజీ కోర్సుల చివరి సంవ‌త్సరం మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్ష‌లను న‌వంబ‌ర్‌ 17 నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు.