ఆదివారం 07 జూన్ 2020
Nipuna-education - Mar 27, 2020 , 13:50:01

షెడ్యూల్ ప్ర‌కారం విడుద‌ల‌ కాని నీట్-2020 అడ్మిట్ కార్డ్‌లు !

షెడ్యూల్ ప్ర‌కారం విడుద‌ల‌ కాని నీట్-2020 అడ్మిట్ కార్డ్‌లు !

నీట్.. దేశంలోని మెడిక‌ల్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జాతీయ‌స్థాయి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌. అయితే ఈ ప‌రీక్ష అడ్మిట్‌కార్డుల‌ను షెడ్యూల్ ప్ర‌కారం మార్చి 27న విడుద‌ల చేయాల్సి ఉంది. కానీ క‌రోనాతో దేశ‌మంతా లాక్‌డౌన్ కావ‌డంతో అడ్మిట్ కార్డుల విడుద‌ల వాయిదా ప‌డినట్లు ఎన్‌టీఏ అధికారి తెలిపారు. క‌రోనా వ‌ల్ల ప‌రీక్ష వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నీట్‌ను నిర్వ‌హిస్తున్న‌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) అధికారి పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు ముందు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ నీట్ వాయిదా వేయడానికి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. నీట్ ప‌రీక్ష‌ను తిరిగి షెడ్యూల్ చేసే నిర్ణయం క‌రోనా పరిస్థితి మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారం మే 3న నీట్ నిర్వహించబడుతుంది అని హెచ్‌ఆర్‌డి కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను వెబ్‌సైట్- ntaneet.nic.in/ntaneet నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 15,93,452 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, జమ్ముక‌శ్మీర్ నుండి సుమారు 33,357 మంది అభ్యర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్నారు.


logo