బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 13, 2020 , 15:56:56

ఆయుష్ పీజీ ప్ర‌వేశ ప‌రీక్ష ఈనెల 29న‌

ఆయుష్ పీజీ ప్ర‌వేశ ప‌రీక్ష ఈనెల 29న‌

న్యూఢిల్లీ: ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఏపీజీఈటీ)-2020 ప‌రీక్ష తేదీని ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది. ఈనెల 29న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తామని నేష‌నల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన అడ్మిట్‌కార్డులను ప‌రీక్ష‌కు రెండు వారాల ముందు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని తెలిపింది. అభ్య‌ర్థులు అధికారిక‌ వెబ్‌సైట్ nta.ac.in లేదా ntaaiapget.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ఆయుర్వేద‌, హోమియోప‌తి, సిద్ధ‌, యునానీ కోర్సుల్లో పీజీ సీట్ల‌ను భ‌ర్తీ చేస్తారు. 

క‌రోనా నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష వాయిదాప‌డుతూ వ‌చ్చింది. దీంతో ద‌ర‌ఖాస్తుల గ‌డువును కూడా జూన్ 30 వ‌ర‌కు ‌పొడిగించారు. షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తుల గ‌డువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయితే దానిని మే 31కి, త‌ర్వాత జూన్ 5కు పొడిగించారు. మ‌హ‌మ్మారి విజృంభ‌న‌తో యూజీసీ నెట్‌, సీఎస్ఐఆర్ నెట్‌, జేఎన్‌యూఈఈ, ఐసీఏఆర్ ఏఐఈఈఏ, ఇగ్నో ఓపెన్‌మ్యాట్ అండ్ పీహెచ్‌డీ ప‌రీక్ష‌ల‌ను ఎన్‌టీఏ వాయిదావేసిన విష‌యం తెలిసిందే. 


logo