బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 07, 2020 , 14:55:40

ఎయిమ్స్‌లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు

ఎయిమ్స్‌లో 3803 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు

న్యూఢిల్లీ: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) దేశ‌వ్యాప్తంగా వివిధ ఎయిమ్స్‌ల‌లో ఖాళీగా ఉన్న న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీస‌ర్ రిక్రూట్‌మెంట్ కామ‌న్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్ఓఆర్సీటీ)-2020‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఆగ‌స్టు 18 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చ‌ని వెల్ల‌డించింది. 


మొత్తం పోస్టులు: 3803

ఇందులో ఎయిమ్స్ న్యూఢిల్లీలో 597 పోస్టులు, భువ‌నేశ్వ‌ర్ 600, డియోగ‌ఢ్ 150, ఘోర‌క్‌పూర్ 100, జోధ్‌పూర్ 176, క‌ల్యాణి 600, మంగ‌ళ‌గిరి 140, ప‌ట్నా 200, రాయ‌బ‌రేలి 594, రాయ్‌పూర్ 246, రిషికేశ్ 300 చొప్పున పోస్టులు ఉన్నాయి. 

అర్హ‌త‌: బీఎస్సీ (ఆన‌ర్స్‌) న‌ర్సింగ్ లేదా బీఎస్సీ న‌ర్సింగ్ చేసి ఉండాలి. లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ న‌ర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. 18 నుంచి 30 ఏండ్ల‌లోపువారై ఉండాలి. 

ఎంపిక విధానం: ‌రాత‌ప‌రీక్ష ద్వారా. ప‌రీక్ష మూడు గంట‌లు ఉంటుంది. ఇందులో 300 ప్ర‌శ్న‌లు అడుగుతారు. మొత్తం 200 మార్కులు. ప్ర‌తి త‌ప్పు ప్ర‌శ్న‌కు 1/3 వంతు మార్కుల‌ను కోత‌విధిస్తారు. 

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.1500, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.1200.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: ఆగ‌స్టు 18

ప‌రీక్ష తేదీ: ‌సెప్టెంబ‌ర్ 1

వెబ్‌సైట్‌: aiimsexams.org‌  


logo