నూలు వస్త్రపరిశ్రమ ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు? 1) హైదరాబాద్ 2) రంగారెడ్డి 3) కుమ్రంభీం ఆసిఫాబాద్ 4) పైవన్నీ
ఏ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ‘ఎల్నినో’ ఏర్పడుతుంది? 1) హిందూ మహాసముద్రం 2) అట్లాంటిక్ మహాసముద్రం 3) పసిఫిక్ మహాసముద్రం 4) ఆర్కిటిక్ మహాసముద్రం
‘కేప్ ఆఫ్ కమోరిన్’ అంటే? 1) ప్రధాన భారతదేశ దక్షిణ చివరి అగ్రం 2) ప్రధాన భారతదేశ ఉత్తర చివరి భాగం 3) ప్రధాన భారతదేశ తూర్పు చివరి భాగం 4) ప్రధాన భారతదేశ పడమర చివరి భాగం
ధనుష్కోడి వేటిని కలుపుతుంది? 1) అరేబియా సముద్రం గల్ఫ్ ఆఫ్ కంబాట్ 2) బంగాళాఖాతం, అరేబియా సముద్రం 3) బంగాళాఖాతం, హిందూమహాసముద్రం 4) హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం
సతత హరిత, శృంగారపు అడవులకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు? 1) పూర్వాంచల్ హిమలయాలు 2) హిమాద్రి హిమాలయాలు 3) శివాలిక్ హిమాలయాలు 4) హిమాచల్ హిమాలయాలు
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద నదీ ద్వీపం ‘మజిలీ’ ఏ ప్రాంతంలో ఉంది? 1) బ్రహ్మపుత్ర మైదానాలు 2) గంగా మైదానాలు 3) రాజస్థాన్ మైదానాలు 4) పంజాబ్, హర్యాన మైదానాలు
సింధూనది గురించిన కింది వ్యాఖ్యల్లో వాస్తవమైనవి? 1) ఆది కైలాస్-మానస సరోవర్లో పుట్టింది 2) సింధు నది పూర్తి పారుదల ప్రదేశపు వైశాల్యం దాదాపు 4లక్షల 20వేల చదరపు మైళ్లు 3) దీనిని పర్షియన్లు హైందవీ అని, టిబెటన్లు సింగె అని పిలుస్తారు 4) సింధు నది భారత్లో 740కి.మీ ప్రవహిస్తుంది
కింది వాటిని పరిశీలించండి? ఆనకట్ట/విద్యుచ్ఛక్తి ప్రాజెక్టు నది ఎ. కిశావు – అలకనంద బి. కోటేశ్వర్ – భగీరథ సి. నంగల్- సట్లెజ్ 1) ఎ 2) ఎ, సి 3) బి, సి 4) బి
సింగరేణి కాలరీస్ కంపెనీ పూర్వనామం? 1) దక్కన్ హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్ 2) దక్కన్ నిజాం కంపెనీ లిమిటెడ్ 3) హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ 4) ఏదీకాదు
భూకంపాలు కింద తెలిపిన ఏ ప్రాంతాల్లో ఏర్పడుతాయి? 1) రెండు శిలావరణ పలకాలు అపసరణం చెందే చోట 2) రెండు శిలావరణ పలకాలు అభిసరణం చెందే చోట 3) రెండు శిలావరణ పలకాలు సమాంతరంగా కదిలేచోట 4) మూడు శిలావరణ పలకాలు ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో కదిలే చోట
కింది వాటిలో ఏ కారణాల వల్ల ప్రమాదకర భూకంపాలు సంభవిస్తాయి? 1) భూతాపాలు 2) అగ్నిపర్వత విస్ఫోటనాలు 3) గనుల పైకప్పు కూలిపోవడం 4) విరూపకారక కారకాలు
ఎడారి ప్రాంతంలో కనిపించే ఇసుక మైదానాలను ఏమని పిలుస్తారు? 1) హమ్మడాలు 2) సెరీర్ 3) ఎర్గ్స్ 4) రెగ్