e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ

బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ

బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ

బోధనోపకరణాలు – వనరులు

 1. జిల్లాస్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనలు ఉత్తమమైనదిగా గుర్తించడానికి పరిగణలోకి తీసుకోని విషయం?
  1) ఆర్థికపరమైన విలువ
  2) వ్యక్తిగత ఇంటర్వ్యూ
  3) శాస్త్రవేత్త కృషి 4) ప్రాజెక్టు మన్నిక
 2. నూతన్‌ తన కుటుంబ నెలవారీ ఖర్చులను ఒక గ్రాఫ్‌ ద్వారా సూచించినా ఆయన ఏ గ్రాఫ్‌ ద్వారా విషయ వివరణ చేసి ఉంచవచ్చు?
  1) బార్‌ గ్రాఫ్‌ 2) వెన్‌ గ్రాఫ్‌
  3) సచిత్ర గ్రాఫ్‌ 4) వృత్త గ్రాఫ్‌
 3. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి వర్క్‌బుక్‌లో పటాలు గీయమని లేదా ప్రదేశాలను గుర్తింపజేసి విద్యాకౌశలాలను అభివృద్ధిపరిచే మ్యాపులు (పటాలు)?
  1) రాజకీయ పటాలు
  2) ఆవరణరేఖా పటాలు
  3) రిలీఫ్‌ పటాలు 4) భౌగోళిక పటాలు
 4. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్‌లోని ‘మేడం టుస్సాడ్స్‌ మ్యూజియం’లో కొలువుదీరిన ప్రధాని మోదీ, సచిన్‌ టెండూల్కర్‌, సినీ నటులు ప్రభాస్‌, మహేష్‌బాబుల మైనపు విగ్రహాలు ఏ రకమైనవి?
  1) త్రిమితీయ ఉపకరణాలు
  2) గ్రాఫిక్‌ ఉపకరణాలు
  3) ప్రక్షేపక ఉపకరణాలు
  4) దృశ్య శ్రవణ ఉపకరణాలు
 5. సాంప్రదాయక ఉపకరణాల స్థానంలో వెల తక్కువ, వెలలేని (లో కాస్ట్‌, నో కాస్ట్‌) ఉపకరణాలను ఉపయోగించి బోధనను వాస్తవికతకు దగ్గరగా మలచాలని సూచించింది?
  1) ఎడ్గార్‌ డేల్‌ 2) కొఠారి
  3) ఈశ్వరీబాయి 4) NPE-86
 6. కింది వాటిలో ఏ బోధనోపకరణం విద్యార్థి దృష్టిని ఆకట్టుకోవడంలో ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది?
  1) ఫ్లాష్‌కార్డు 2) చిత్రం
  3) నిజవస్తువు 4) నమూనా
 7. కింది వాటిలో నల్లబల్లకు సంబంధించిన అంశాలు?
  ఎ. కుడివైపు మొదలుపెట్టి ఎడమవైపునకు రాయాలి
  బి. కింద నుంచి పైకి తుడవాలి
  సి. పూర్తిగా గోడమొత్తం ఉండేలా అమర్చాలి
  డి. తరగతి గది ప్రక్రియకు అద్దం వంటిది
  1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) డి, ఎ
 8. వ్యక్తి ప్రయోజనం కంటే సమష్టి ప్రయోజనం ముఖ్యం. వ్యక్తి నిర్ణయం కంటే సమష్టి నిర్ణయం గొప్పది అనే ఆలోచనను అనుసరించేవి?
  1) గ్రంథాలయాలు 2) ప్రయోగశాలలు
  3) సంఘాలు 4) ప్రదర్శనలు
 9. మనం తినే ఆహారం పాఠ్యాంశం బోధించడానికి దగ్గరలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శింపజేయించిన ఉపాధ్యాయుడు, ఆ విద్యార్థులకు కలిగించిన అనుభవాలు ఎడ్గార్‌ డేల్‌ శంఖువుననుసరించి ఏ సోపానాన్ని సూచిస్తుంది?
  1) కల్పిత అనుభవాలు 2) నాటకీకరణ
  3) ప్రదర్శనలు 4) క్షేత్ర పర్యటనలు
 10. ఎడ్గార్‌ డేల్‌ శంఖువులో అగ్ర భాగం నుంచి ఆధార భాగానికి జరిగే చర్య?
  1) మూర్తం పెరుగుదల, అమూర్తం తగ్గుదల
  2) మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల
  3) అనుభవాల విస్తృతి పెరుగుతుంది
  4) 1, 3
 11. అనుభవాలు, మానవ సంబంధాలు, పాత్రలు, సందర్భాలు, కథలు, ఉద్వేగాలు మొదలైన వాటిని సజీవంగా వ్యక్తీకరించే అనుభవ శంఖువులోని సోపానం?
  1) క్షేత్ర పర్యటన 2) ప్రదర్శన
  3) నాటకీకరణ 4) కల్పిత అనుభవం
 12. ‘నీటిని పొదుపు చేయండి-ధరిత్రిని రక్షించండి’ అనే నినాదం, ‘ఉపాధ్యాయుడు తయారుచేసిన చార్టు’ అనేవి వరుసగా
  1) శబ్ద సంకేతం, దృశ్య సంకేతం
  2) దృశ్య సంకేతం, శబ్ద సంకేతం
  3) రెండూ దృశ్య సంకేతాలు
  4) రెండే శబ్ద సంకేతాలు
 13. హంటర్స్‌ స్కోర్‌ కార్డు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేసేటప్పుడు కింది వాటిలో తక్కువ గణనలు కేటాయించబడిన అంశం?
  1) విషయం
  2) పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు
  3) భాషాశైలి
  4) మనో విజ్ఞాన శాస్త్ర ఆధారం
 14. కింది వాటిలో ప్రత్యక్ష అనుభవాన్నిచ్చేవి?
  1) సొంతంగా నమూనాలు తయారుచేయడం
  2) రేడియో రికార్డింగ్‌ వినడం
  3) ఫొటోగ్రాఫ్‌లు పరిశీలించడం
  4) కంప్యూటర్‌లో బొమ్మలు చూడటం
 15. సమాజ సంబంధిత పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిత్యజీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర?
  1) అన్వేషకుడు 2) సమన్వయకర్త
  3) మార్గదర్శి 4) సౌకర్యకర్త
 16. మా టీవీ (స్టార్‌ మా)లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు?
  1) స్పెసిమన్‌ 2) డయోరమ
  3) కార్టూన్‌ 4) ఎగ్జిబిట్‌
 17. జియో బోర్డు ఉపయోగం
  1) చతుర్విధ ప్రక్రియలు బోధించవచ్చు
  2) చతుర్భుజ రకాలు ప్రదర్శించవచ్చు
  3) స్థాన విలువలు అవగాహనపర్చవచ్చు
  4) ఆరోహణ, అవరోహణ వివరించవచ్చు
 18. కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేక ప్రక్రియలను సులువుగా వివరించగలిగే కృత్యోపకరణం?
  1) హెర్బేరియం 2) అక్వేరియం
  3) వైవేరియం 4) టెర్రేరియం
 19. భూ భ్రమణం, భూ పరిభ్రమణం పాఠ్యాంశాలను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా నేర్చుకున్న విద్యార్థి పొందిన జ్ఞానం?
  1) 3.5 శాతం 2) 11 శాతం
  3) 83 శాతం 4) 94 శాతం
 20. పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయుడు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు గ్రామంలోని వడ్రంగి, కుమ్మరి పని ప్రదేశాలకు సందర్శన ఏర్పాటు చేశాడు. ఇక్కడ అతడు ఏ రకమైన వనరులు ఉపయోగించాడు?
  1) స్థానిక వనరులు 2) చారిత్రక వనరులు
  3) మేధో వనరులు 4) సహజ వనరులు

Answers

- Advertisement -

1-2, 2-4, 3-3, 4-3, 5-2, 6-3, 7-3, 8-4, 9-2, 10-3, 11-3, 12-3, 13-2, 14-4, 15-1, 16-4, 17-3, 18-1, 19-4, 20-4.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ
బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ
బిగ్‌బాస్‌ హౌస్‌ కృత్రిమ నిర్మాణం దేనికి ఉదాహరణ

ట్రెండింగ్‌

Advertisement