e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఏర్పాటుకు కారణం?

నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఏర్పాటుకు కారణం?

 1. జాతీయాదాయ వృద్ధిరేటు నుంచి జనాభా వృద్ధిరేటును తీసివేస్తే ఏం పొందవచ్చు?
  1) వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు
  2) నికర జాతీయోత్పత్తి వృద్ధిరేటు
  3) తలసరి ఆదాయ వృద్ధిరేటు
  4) వాస్తవిక ఆదాయ వృద్ధిరేటు
 2. హారడ్‌-డోమర్‌ నమూనాలో సమతులవృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది?
  1) పొదుపు రేటు & జనాభా వృద్ధిరేటు
  2) వడ్డీరేట్లు & ద్రవ్యోల్బణం
  3) పొదుపు రేటు& ఉత్పత్తి మూలధన రేటు
  4) జాతీయాదాయం వృద్ధిరేటు & జనాభా వృద్ధిరేటు
 3. కింది వాటిలో అమర్త్యసేన్‌ రచన?
  1) ప్లానింగ్‌ అండ్‌ ద పూర్‌
  2) చాయిస్‌ ఎకనామిక్స్‌ అండ్‌ టెక్నిక్స్‌
  3) వెల్ఫేర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ టెక్నిక్స్‌
  4) ప్లాన్‌డ్‌ ఎకానమీ ఫర్‌ ఇండియా
 4. 1991 సంస్కరణల తరువాత అమలైన నూతన ఆర్థిక విధానంలో మన దేశం కింది వాటిలో దేనిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది?
  1) బ్యాంకింగ్‌ రంగం
  2) ఎగుమతులను ప్రోత్సహించడం
  3) దిగుమతి ప్రత్యామ్నాయాలు
  4) స్వయం సమృద్ధి సాధించడం
 5. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను గమనించండి?
  ఎ. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన రేటును చెల్లించాలి
  బి. మహిళ, పురుష కూలీలకు సమాన వేతన రేటును చెల్లించాలి
  సి. ఈ పథక లబ్ధిదారుల్లో మూడో వంతు కూలీలు స్త్రీలై ఉండాలి
  డి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి
  1) సి, డి, ఎ 2) డి, ఎ, బి
  3) ఎ, బి, సి 4) బి, సి, డి
 6. జతపర్చండి
  పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం
  ఎ. 9వ 1. భారీ పరిశ్రమల అభివృద్ధి
  బి. 8వ 2. పేదరిక నిర్మూలన
  సి. 5వ 3. సమ్మిళిత వృద్ధి
  డి. 2వ 4. మానవ వనరుల అభివృద్ధి
  1) ఎ-4, బి-2, సి-3, డి-1
  2) ఎ-1, బి-2, సి-4, డి-3
  3) ఎ-2, బి-3, సి-1, డి-4
  4) ఎ-3, బి-4, సి-2, డి-1
 7. జాతీయాదాయంపై గల కింది వివరణల్లో ఏది సరైనది?
  1) అద్దెలు, వేతనాలు, వడ్డీలు, లాభాలు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
  2) రెండు సార్లు లెక్కించడం, బదిలీ చెల్లింపులు, అప్పులు, దిగుమతులు జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
  3) జాతీయాదాయంలో అద్దెలు, పన్నులు, పింఛన్లు, సబ్సిడీలు భాగంగా ఉంటాయి
  4) ప్రభుత్వరంగ వ్యయం,
  ఎన్నికల వ్యయం, న్యాయవ్యవస్థ వ్యయం జాతీయాదాయంలో భాగంగా ఉంటాయి
 8. జతపర్చండి
  ఎ. KVIC 1. 1980
  బి. CAPART 2. 1956
  సి. DIC 3. 1986
  1) ఎ- 2, బి-3, సి-1
  2) ఎ-2, బి-1, సి-3
  3) ఎ-1, బి-3, సి-2
  4) ఎ-3, బి-2, సి-1
 9. మాల్థస్‌ ప్రకారం ఆహార ధాన్యాల పెరుగుదల రేటు అంకగణిత శ్రేణిలో ఉంటే జనాభా పెరుగుదల రేటు ఏ శ్రేణిలో ఉంటుంది?
  1) అంకగణిత శ్రేణి
  2) స్థిరంగా ఉంటుంది
  3) హరాత్మక శ్రేణి
  4) గుణాత్మక శ్రేణి
 10. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలకు సంబంధించి సరికానిది ఏది?
  1) జనాభా వృద్ధిరేటు తగ్గుతూ ఉంటుంది
  2) అవస్థాపనా సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి
  3) బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్తరిస్తూ ఉంటుంది
  4) వ్యవసాయం మీద ఆధారపడిన జనాభా పెరుగుతూ ఉంటుంది
 11. జతపర్చండి
  ప్రతిపాదన ఆర్థికవేత్త
  ఎ. Head count Ratio
  1. దండేకర్‌, రథ్‌
  బి. P-Index
  2. గౌరవదత్‌, రావెల్లిన్‌
  సి. Poverty Gap Index
  3. అమర్త్యసేన్‌
  డి. Gini Index
  4. గిని, లారెంజ్‌
  1) ఎ-3, బి-1, సి-2, డి-4
  2) ఎ-2, బి-3, సి-1, డి-4
  3) ఎ-1, బి-3, సి-2, డి-4
  4) ఎ-4, బి-3, సి-2, డి-1
 12. దీర్ఘకాలంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే పరిశ్రమలు?
  1) మూలధన వస్తువుల పరిశ్రమలు
  2) వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు
  3) వినియోగ వస్తువుల పరిశ్రమలు
  4) ఏదీకాదు
 13. 6వ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పెద్దతరహా ఇనుము ఉక్కు కర్మాగారం ఏది?
  1) సేలం ఉక్కు కర్మాగారం (తమిళనాడు)
  2) విజయనగర ఉక్కు కర్మాగారం
  (కర్నాటక)
  3) విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఏపీ)
  4) పైవన్నీ
 14. బ్రిటిష్‌ పాలనతో భారత వ్యవసాయంలో వచ్చిన మార్పు?
  1) క్రిమిసంహారక మందుల వినియోగం
  2) రసాయన ఎరువుల వినియోగం
  3) వ్యవసాయ వాణిజ్యీకరణ
  4) విస్తీర్ణం గణనీయంగా పెరుగుదల
 15. భూసంస్కరణల క్రమం..?
  ఎ. జమీందారీ వ్యవస్థ రద్దు
  బి. కౌలు సంస్కరణలు
  సి. భూకమతాలపై గరిష్ట పరిమితి
  డి. సహకార వ్యవసాయం
  1) బి, ఎ, డి, సి 2) ఎ, సి, బి, డి
  3) డి, ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
 16. నాబార్డ్‌ ఏ రకమైన బ్యాంక్‌?
  1) షెడ్యూల్డ్‌ ప్రభుత్వ వాణిజ్య బ్యాంక్‌
  2) రీ ఫైనాన్సింగ్‌ బ్యాంక్‌
  3) సహకార బ్యాంక్‌
  4) ప్రైవేటు బ్యాంక్‌
 17. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది?
  1) ఎక్సైజ్‌ సుంకం 2) భూమి శిస్తు
  3) ఇంటి పన్ను 4) మూలధన పన్ను
 18. ఆహార పంటలకు కనీస మద్దతు ధర ఎవరు నిర్ణయిస్తారు?
  1) ఆహార వ్యవసాయ సంస్థ (FAO)
  2) కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ
  3) వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌
  4) రాష్ట్ర ప్రభుత్వం
 19. జతపర్చండి ఎ. బొంబాయి ప్రణాళిక
  1. 8 మంది పారిశ్రామికవేత్తల గ్రూపు
   బి. ప్రజల ప్రణాళిక
  2. జయప్రకాశ్‌ నారాయణ్‌
   సి. గాంధీ ప్రణాళిక
  3. శ్రీమన్నారాయణ అగర్వాల్‌
   డి. సర్వోదయ ప్రణాళిక
  4. ఎంఎన్‌ రాయ్‌
   1) ఎ-4, బి-1, సి-3, డి-2
   2) ఎ-1, బి-4, సి-3, డి-2
   3) ఎ-1, బి-4, సి-2, డి-3
   4) ఎ-2, బి-4, సి-3, డి-1
 20. లింగ సాధికార సూచీలో స్త్రీలకు సంబంధించి పరిగణించని అంశం ఏది?
  1) రాజకీయ భాగస్వామి
  2) ఆర్థిక వనరులపై ఆధిక్యత
  3) సంస్థలకు నాయకత్వం వహించడం
  4) ఆర్థిక భాగస్వామ్యం
 21. ప్రణాళిక వనరుల్లో లోటు ద్రవ్య విధానం వల్ల వచ్చే ఇబ్బంది?
  1) ద్రవ్య సరఫరా, ద్రవ్యోల్బణం
  పెరుగుతుంది
  2) ద్రవ్య సరఫరా పెరిగి పేదరికం తగ్గుతుంది
  3) ద్రవ్య సరఫరా తగ్గి డిమాండ్‌ తగ్గుతుంది
  4) ద్రవ్య సరఫరా స్థిరంగా ఉండి ఉద్యోగ కల్పన స్తబ్దత
 22. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశంలో నోడల్‌ ఏజెన్సీ ఏది?
  1) పర్యావరణ మంత్రిత్వ శాఖ
  2) జాతీయాభివృద్ధి మండలి
  3) నీతి ఆయోగ్‌
  4) నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌
 23. 2వ పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి కారణం?
  ఎ. విదేశీ మారక నిల్వల కొరత
  బి. శక్తికి మించిన లక్ష్యం
  సి. వ్యవసాయం నుంచి పరిశ్రమలకు
  ప్రాధాన్యత మార్చడం
  డి. పైవన్నీ
  1) ఎ, బి 2) బి, సి
  3) ఎ 4) డి
 24. ఆర్థికాభివృద్ధిలో ద్వంద్వత్వం అంటే?
  1) ద్వంద్వ ధరల విధానం
  2) వ్యవస్థాగతమైన, అవ్యవస్థాగతమైన వ్యవస్థలు ఉండటం
  3) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు
  సమకాలికంగా ఉండటం
  4) కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళిక
  వ్యవస్థలు ఉండటం
 25. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఏర్పాటుకు కారణం?
  1) దత్తాంశ సేకరణలో ఇబ్బందుల
  తొలగింపు
  2) దేశ జాతీయాదాయ వృద్ధికి అవసరమైన వనరుల సేకరణ
  3) జాతీయాదాయ మదింపులో గల
  సమస్యల పరిష్కారం
  4) ఇతర దేశాలతో దేశపు జాతీయాదాయాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడం
 26. జతపర్చండి
  ఎ. ఉద్యోగుల బీమా చట్టం 1. 1979
  బి. కనీస వేతనాల చట్టం 2. 1976
  సి. సమాన వేతనాల చట్టం 3. 1948
  డి. అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం
  4. 1948
  1) ఎ-4, బి-3, సి-2, డి-1
  2) ఎ-3, బి-4, సి-1, డి-2
  3) ఎ-1, బి-3, సి-2, డి-4
  4) ఎ-2, బి-3, సి-4, డి-1
 27. ‘మేరా గావ్‌- మేరా గౌరవ్‌’ దేనికి సంబంధించినది?
  1) ప్రవాస భారతీయులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం
  2) పార్లమెంట్‌ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం
  3) వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలను దత్తత తీసుకుని వ్యవసాయ విస్తీర్ణాన్ని
  పెంచడానికి కృషి చేయడం
  4) గ్రామ సర్పంచ్‌ నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి
 28. పిసి కల్చర్‌ అంటే?
  1) చేపల పెంపకం
  2) ద్రాక్షతోటల పెంపకం
  3) పట్టుపురుగుల పెంపకం
  4) కూరగాయల పెంపకం
 29. ఒక దేశంలో శిశు జనాభా వృద్ధిరేటు కంటే పనిచేసే వయస్సు గల జనాభా వృద్ధిరేటు అధికంగా ఉంటే అది దేనికి దారితీస్తుంది?
  1) అధిక ఆధారిత నిష్పత్తి
  2) అల్ప ఆధారిత నిష్పత్తి
  3) అనాధారిత నిష్పత్తి
  4) మధ్యస్థ ఆధారిత నిష్పత్తి
 30. దేశంలో విదేశీ మారక ద్రవ్యం, స్వేచ్ఛా మార్కెట్‌, రాష్ర్టాల రుణ సంబంధ విషయాల్లోని చట్టాలను అవి అమలైన సంవత్సరాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి?
  1) MRTP, FERA, FEMA, FRBM
  2) FERA, MRTP, FRBM, FEMA
  3) FRBM, FEMA, FERA, MRTP
  4) MRTP, FEMA, FERA, FRBM

Answers
1-3, 2-3, 3-2, 4-2, 5-3, 6-4, 7-1, 8-1, 9-4, 10-2, 11-3, 12-1, 13-4, 14-3, 15-4, 16-2, 17-1, 18-3, 19-2, 20-3, 21-1, 22-3, 23-4, 24-2, 25-2, 26-1, 27-3, 28-1, 29-2, 30-1

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana