e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ తెలంగాణలో ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?

తెలంగాణలో ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?

తెలంగాణలో ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?
 1. ప్రతిపాదన (ఏ): గయానా నుంచి భారత్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది (ఎ)
  కారణం (ఆర్‌): ముడిచమురు కోసం మధ్య ప్రాచ్యం, ఒపెక్‌ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్‌ నిర్ణయించింది
  ఎ) ఏ, ఆర్‌ రెండూ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ రెండూ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: ముడిచమురు కోసం మిడిల్‌ ఈస్ట్‌, ఒపెక్‌ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్‌ నిర్ణయించింది. గయానా నుంచి దిగుమతి చేసుకోనుంది. ప్రపంచంలో ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకొనే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి మధ్య ఒపెక్‌ దేశాల నుంచి చమురు దిగుమతులు భారత్‌కు గణనీయంగా తగ్గాయి. గయానా లిజా నుంచి 10 లక్షల బ్యారెళ్ల లైట్‌ స్వీట్‌ ముడి చమురుతో కార్గోనౌక మార్చి 2న బయలుదేరింది. ఏప్రిల్‌ 8న ఈ నౌక భారత్‌లోని ముంద్రా పోర్ట్‌కు చేరింది.
 2. గిగామెష్‌ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
  ఎ) కరోనా వైరస్‌ను కట్టడి చేసే ఒక కొత్త పరికరం
  బి) తీగలు లేకుండా ఇంటర్నెట్‌ కల్పించే సాధనం
  సి) అత్యంత వేగంగా కాంతిని ప్రసరింపచేసే సాధనం
  డి) ఏదీ కాదు
  వివరణ: గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు తీగలు లేకుండానే నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను తక్కువ ధరకే అందించేందుకు ఆస్ట్రోమ్‌ అనే స్టార్టప్‌ సంస్థ గిగామెష్‌ అనే ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. భారత్‌, అమెరికా దేశాల నుంచి పేటెంట్‌ను కూడా పొందింది. భారత్‌లాంటి దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సేవలు అందించడం చాలా కష్టం. ఫైబర్‌ వేసేందుకు భారీ వ్యయం అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా గిగామెష్‌ ఉపయోగపడుతుంది.
 3. తొలి వన్డే మ్యాచ్‌లోనే అతి తక్కువ బంతుల్లో 50 పరుగులు సాధించిన క్రికెటర్‌ ఎవరు? (సి)
  ఎ) జాన్‌మోరిస్‌ బి) రోహిత్‌ శర్మ
  సి) కృనాల్‌ పాండ్య డి) సురేశ్‌ యాదవ్‌
  వివరణ: అరంగేట్రం లేదా తొలి మ్యాచ్‌లోనే అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కృనాల్‌ పాండ్య కొత్త రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్‌తో మార్చి 23న జరిగిన వన్డే పోటీలో పాండ్య కేవలం 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఇంత తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసి ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పాడు. అంతకు ముందు ఆ రికార్డ్‌ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జాన్‌ మోరిస్‌ పేరిట ఉంది. 1990లో అతడు ఇంగ్లండ్‌పై కేవలం 35 బంతుల్లో తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఆ రికార్డ్‌ను తాజాగా కృనాల్‌పాండ్య బద్దలుకొట్టాడు
 4. 2450 ఈ సంఖ్య ఇటీవల వార్తల్లో నిలవడానికి కారణం? (డి)
  ఎ) తాజాగా పెరిగిన గరిష్ట వేతనం బి) తెలంగాణలోని వృక్ష జాతులు
  సి) భారత్‌లోని జంతు, వృక్ష జాతులు డి) తెలంగాణలో జంతు జాతులు
  వివరణ: తెలంగాణలో మొత్తం 2450 రకాల జంతు జాతులు ఉన్నాయని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. ఇందులో 1744 వెన్నెముక లేనివి కాగా మిగిలిన 706 వెన్నెముక ఉన్నవి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జంతు జాలంపై రూపొందించిన తొలి పుస్తకం. కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రాలు విశిష్ట జంతు జాలానికి కేంద్రంగా ఉన్నట్లు జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పేర్కొంది. తెలంగాణ అడవుల్లో మాత్రమే కనిపించే 82 రకాల జంతువులను కూడా ఇందులో పేర్కొన్నారు
 5. బిమ్‌స్టెక్‌ కూటమిలో ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి? (డి)
  ఎ) 10 బి) 6 సి) 8 డి) 7
  వివరణ: బిమ్‌స్టెక్‌లో ఏడు దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి, అవి భారత్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌. ఏప్రిల్‌ 1న ఈ కూటమి సమావేశం వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించారు. దీనికి శ్రీలంక దేశం నేతృత్వం వహించింది. బిమ్‌స్టెక్‌కి పూర్తి రూపం- బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌. ఈ కూటమి సచివాలయం ఢాకాలో ఉంది.
 6. బిమ్‌స్టెక్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫెసిలిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (సి)
  ఎ) న్యూఢిల్లీ బి) బ్యాంకాక్‌
  సి) కొలంబో డి) ఢాకా
  వివరణ: బిమ్‌స్టెక్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫెసిలిటీని కొలంబోలో ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్‌ 1, 2021లో కూటమిలోని దేశాల మధ్య వర్చువల్‌ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు ఒప్పందాలు కుదిరాయి. అవి 1. నేరమయ అంశాల్లో పరస్పర న్యాయ సహకారం 2. దౌత్య సంబంధ, శిక్షణ వ్యవస్థల ఏర్పాటు 3. కొలంబోలో బిమ్‌స్టెక్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ ఫెసిలిటీ ఏర్పాటు. ఈ సమావేశంలో భారత్‌ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు
 7. ఎకో, బైఫ్రాస్ట్‌ అనే పేర్లు ఇటీవల వార్తల్లో నిలిచాయి, ఇవి ఏంటి? (బి)
  ఎ) కొత్త సాఫ్ట్‌వేర్లు
  బి) సముద్ర అంతర్భాగ కేబుల్‌ వైర్లు
  సి) కరోనాను గుర్తించేందుకు ప్రతిధ్వనితో పనిచేసే పరికరాలు
  డి) ఏదీకాదు
  వివరణ: సముద్ర అంతర్భాగంలో కేబుల్‌ వైర్లను అందుబాటులోకి తెచ్చుకోవాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలు నిర్ణయించాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం, ఉత్తర అమెరికాలను అనుసంధానం చేసేలా ఎకో, బైఫ్రాస్ట్‌ పేర్లతో వీటిని తీసుకు రానున్నారు. అమెరికా పశ్చిమ తీరాన్ని సింగపూర్‌, ఇండోనేషియాలతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల సమాచార మార్పిడి 70% మేర పెరుగుతుంది. ఫేస్‌బుక్‌ ఈ రెండు కేబుళ్లలోను, గూగుల్‌ మాత్రం కేవలం ఎకో వైర్లలోనే పెట్టుబడి పెట్టనున్నాయి.
 8. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు తెలంగాణలోని ఏ జిల్లాతో సరిహద్దు ఉంది? (ఎ)
  ఎ) భద్రాద్రి కొత్తగూడెం
  బి) ములుగు
  సి) జయశంకర్‌ భూపాలపల్లి
  డి) ఆదిలాబాద్‌
  వివరణ: సుక్మా జిల్లా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాతో కూడా సరిహద్దును కలిగి ఉంది. ఇటీవల సుక్మా జిల్లా వార్తల్లో నిలిచింది. ఏప్రిల్‌ 3న ఈ జిల్లాలో నక్సల్స్‌, పోలీస్‌ బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ జిల్లాను 2012లో దంతెవాడ నుంచి విభజించి ఏర్పాటు చేశారు. గోదావరికి ఉపనది అయిన శబరి సుక్మా జిల్లా గుండా ప్రవహిస్తుంది.
 9. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి (సి)
  1. దేశంలో తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌ తెలంగాణలో ఏర్పాటు కానుంది
  2. పీఎం కుసుం పథకంలో భాగంగా తొలి వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్‌ కేంద్రం గుజరాత్‌లో ఏర్పాటు చేశారు
  3. పీఎం కుసుం పథకంలో భాగంగా తొలి వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్‌ కేంద్రం రాజస్థాన్‌లో ఏర్పాటు చేశారు
   ఎ) 1, 2 బి) 1 సి) 1, 3 డి) 2
   వివరణ: దేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను తెలంగాణలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తుంది. దీని సామర్థ్యం 100 మెగావాట్లు. అలాగే ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్ష ఎవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం కుసుం) పథకంలో భాగంగా దేశంలో వ్యవసాయ ఆధారిత తొలి సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభించారు. ఏటా ఇది 17 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 10. గ్రామీణ ఉపాధి కల్పనలో తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా? (డి)
  ఎ) నిజామాబాద్‌ బి) మెదక్‌
  సి) రంగారెడ్డి డి) కామారెడ్డి
  వివరణ: గ్రామీణ ఉపాధి కల్పనలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రగతి సూచికలో తొలి స్థానం సాధించి ఈ స్థానాన్ని దక్కించుకుంది. నిధుల వ్యయం, పనిదినాల కల్పన, కనీస వేతనం, కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు తదితర నాలుగు అంశాల్లో తొలి స్థానాన్ని కామారెడ్డి పొందింది. రెండు, మూడు స్థానాల్లో నల్లగొండ, నిజామాబాద్‌లు దక్కించుకున్నాయి
 11. జతపరచండి? (డి)
  1. రెపోరేట్‌ ఎ. 18%
  2. నగదు నిల్వల నిష్పత్తి బి. 4.25%
  3. బ్యాంక్‌ రేట్‌ సి. 3.50%
  4. చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి డి. 4%
   ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
   బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
   సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
   వివరణ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ ఏప్రిల్‌ 7న ప్రకటించింది. కొవిడ్‌ ప్రభావాన్ని పరిమితం చేయడంతో పాటు వృద్ధిలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు సర్దుబాటు విధాన వైఖరికే ప్రాధాన్యం ఇస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. అలాగే ఏటా జూలైలో సమ్మిళిత ఆర్థిక సూచీని విడుదల చేయాలని కూడా ఆర్‌బీఐ నిర్ణయించింది. అంతకుముందు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమ్మిళిత అంశాలను పరిగణిస్తూ ఈ సూచీని విడుదల చేస్తారు.
 12. ఇటీవల మెడ్‌ట్రానిక్‌ సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది, దీని ప్రత్యేకత ఏంటి? (సి)
  ఎ) ఆ సంస్థకు ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఇన్నోవేషన్‌ కార్యాలయం
  బి) ఆ సంస్థకు ఇదే తొలి కార్యాలయం
  సి) అమెరికా వెలుపల మెడ్‌ట్రానిక్‌ సంస్థకు అతిపెద్ద ఇన్నోవేషన్‌ కేంద్రం
  డి) ఏదీకాదు
  వివరణ: హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో మెడ్‌ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ 7న ప్రారంభించారు. అమెరికాకు వెలుపల మెడ్‌ట్రానిక్‌ సంస్థ ఏర్పాటు చేసిన అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఇదే. రూ.1200 కోట్ల పెట్టుబడులతో దీనిని ఏర్పాటు చేశారు. రానున్న అయిదు సంవత్సరాల్లో దాదాపు వెయ్యిమందికి ఈ కేంద్రం ద్వారా ఉపాధి లభించనుంది. ఆ సంస్థ వద్ద ఇప్పటికే 150 వరకు పేటెంట్‌ హక్కులు ఉన్నాయి. మరో 400 వరకు ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కూడా ఉన్నాయి.
 13. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజును నిర్వహిస్తారు? (డి)
  ఎ) ఏప్రిల్‌ 4 బి) ఏప్రిల్‌ 5
  సి) ఏప్రిల్‌ 6 డి) ఏప్రిల్‌ 7
  వివరణ: ఏటా ఏప్రిల్‌ ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. 1948లో జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడిన రోజు ఇదే. ఈ ఏడాది ఈ దినోత్సవ ఇతి వృత్తం ‘ప్రతి ఒక్కరికి సమ్మతమైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించడం (బిల్డింగ్‌ ఏ ఫెయిరర్‌, హెల్తియర్‌ వరల్డ్‌ ఫర్‌ ఎవ్రీవన్‌)’. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రస్తుతం 194 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దీనికి టెడ్రోస్‌ అథనామ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు.
 14. ఎస్‌యూపీఏసీఈ (సుపాస్‌) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (ఎ)
  ఎ) సుప్రీంకోర్ట్‌ ప్రారంభించిన ఒక క్రృతిమ మేధ ఆధారిత పోర్టల్‌
  బి) పార్లమెంట్‌కు సంబంధించిన పూర్వ చట్టాలని విశదీకరించే పోర్టల్‌
  సి) రాజ్యాంగం అమలుతీరును ప్రభావితం చేసిన సుప్రీంకోర్ట్‌ తీర్పులు
  డి) ఏదీకాదు
  వివరణ: ఎస్‌యూపీఏసీఈ అనేది సుప్రీంకోర్ట్‌ ప్రారంభించిన ఒక కృత్రిమ మేధ పోర్టల్‌. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే దీనిని ఏప్రిల్‌ 6న ప్రారంభించారు. ఎస్‌యూపీఏసీఈ అనేది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే.. సుప్రీంకోర్ట్‌ పోర్టల్‌ ఫర్‌ అసిస్టెన్స్‌ ఇన్‌ కోర్ట్స్‌ ఎఫిషియన్సీ. చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది సేకరిస్తుంది. తద్వారా న్యాయమూర్తులకు పనిభారం తగ్గుతుంది. ఇది నిర్ణయీకరణ చేయదు. కానీ సంబంధిత వాస్తవిక అంశాలను మాత్రమే పొందుపరుస్తుంది. నిర్ణయీకరణ అనేది న్యాయమూర్తి వద్దే ఉంటుంది.
 15. చంద్రా నాయుడు ఇటీవల మృతిచెందారు. ఆమెకు సంబంధించి కింది వాటిలో సరైనది? (సి)
  ఎ) స్వతంత్ర భారత దేశ తొలి మహిళా జర్నలిస్ట్‌
  బి) స్వతంత్ర భారత దేశంలో తొలి క్రీడాకారిణి
  సి) భారత దేశపు తొలి మహిళా క్రికెట్‌ వ్యాఖ్యాత
  డి) ఏదీకాదు
  వివరణ: భారత దేశపు తొలి మహిళా క్రికెట్‌ కామెంటేటర్‌ చంద్రా నాయుడు ఇటీవల మరణించారు. ఆమె భారత తొలి టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ సీకే నాయుడు కుమార్తె. ఇండోర్‌లోని గర్ల్స్‌ కాలేజీలో ఆమె ప్రొఫెసర్‌గా ఉండేవారు. అదేవిధంగా క్రికెట్‌ వ్యాఖ్యాతగా కూడా ఆమె వ్యవహరించారు. 1976-77 సీజన్‌లో ఎంసీసీ వర్సెస్‌ ముంబైల మధ్య జరిగిన పోటీకి ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

Advertisement
తెలంగాణలో ఎన్ని రకాల జంతు జాతులు ఉన్నాయి?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement