e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?

సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?

సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?
 1. విటమిన్‌ A లోపం వల్ల కలిగే వ్యాధికానిదేది?
  1) నిక్టోలోపియా 2) గ్లిరాప్తాల్మియా
  3) ఆస్టియోమలేషియా
  4) కెరటోమలేషియా
 2. అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది?
  ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి బయటనుంచి ఆహారంగా తీసుకోవాలి
  బి. ఇవి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తా యి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరం
  1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
 3. జతపరచండి.
  1) కుంతకాలు ఎ. విసురుదంతాలు
  2) రదనికలు బి. నమిలే దంతాలు
  3) అగ్రచర్వణకాలు సి. చీల్చేదంతాలు
  4) చర్వణకాలు డి. కోరపళ్లు
  1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
 4. జాకబ్‌సన్‌ అనే జ్ఞానేంద్రియం ఉన్న జీవి?
  1) పాము 2) తేలు 3) బల్లి 4) రొయ్య
 5. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనేందుకు కారణం?
  1) వినాళభాగం, నాళసహిత భాగం రెండూ కలిగి ఉంటుంది
  2) ఇది ఎంజైమ్‌లు, హార్మోన్‌లను
  స్రవిస్తుంది
  3) ఇది జీర్ణక్రియలో, గ్లూకోజ్‌ నియంత్రణలో పాల్గొంటుంది
  4) పైవన్నీ
 6. రేడియో ధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యే భాగం ఏది?
  1) మెదడు 2) హృదయం
  3) మూత్రపిండాలు 4) ఊపిరితిత్తులు
 7. శ్వాసక్రియా రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?
  1) చిన్నపిల్లలు 2) యువకులు
  3) మధ్యవయస్కులు 4) ముసలివారు
 8. కింది వాటిలో సరైనది
  ఎ. అంతస్రావిక గ్రంథుల్లో అతిచిన్నది పీయూషగ్రంథి
  బి. పీయూషగ్రంథి అన్ని అంతస్రావ
  గ్రంథులను తన ఆధీనంలో ఉంచుతుంది
  1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
 9. కింది వాటిని జతపర్చండి హార్మోన్‌ లోపం వల్ల కలిగే వ్యాధి
  1. ఆల్డోస్టిరాన్‌ ఎ. క్రెటినిజం
  2. పారాథార్మోస్‌ బి. కుషింగ్‌ వ్యాధి
  3. కార్టిసాల్‌ సి. టెటాని
  4. థైరాక్సిన్‌ డి. ఎడిసన్స్‌ వ్యాధి
   1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
   2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
   3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
   4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
 10. కింది వాటిలో సరైనది?
  ఎ. ముష్కాలను తొలగించడాన్ని ఆర్కిడెక్టమీ అంటారు
  బి. పురుషుల్లో హార్మోన్‌ల అసమతుల్యం వల్ల క్షీరగ్రంథులు ఏర్పడటాన్ని గైనకోమాస్టియా అంటారు
  1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
 11. చెవిలో సమతాస్థితిలో పాల్గొనే నిర్మాణాలు
  1) యుస్టేషియన్‌ నాళం, కర్ణావర్తం
  2) కర్ణావర్తం, పేటిక
  3) పేటిక, అర్థవర్తుల కుల్యాలు
  4) యుస్టేషియన్‌ నాళం, పేటిక
 12. థిసియాలజీ అంటే?
  1) టీబీ అధ్యయనం
  2) టెటనస్‌ అధ్యయనం
  3) న్యూమోనియా అధ్యయనం
  4) డిప్తీరియా అధ్యయనం
 13. ప్రపంచంలో మొదట తయారుచేసిన కృత్రిమ డ్రగ్‌ ఏది? అది ఏ వ్యాధి నివారణకు వాడతారు?
  1) టెట్రాసైక్లిన్‌ 2) పెన్సిలిన్‌, ఆంత్రాక్స్‌
  3) క్లోరోమైసిటివ్‌, టీబీ
  4) ప్రాంటోసిల్‌, మెనింజైటిస్‌
 14. అతినిద్ర వ్యాధి కలిగించే కారకం ఏది?
  1) లీష్మానియా 2) క్లాస్ట్రీడియం
  3) ట్రిపనోసోమా 4) ఎంటమీబా
 15. పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి?
  1) పైలేరియా 2) టీనియాసిస్‌
  3) ఆస్కారియాసిస్‌ 4) కాండిడియాసిస్‌
 16. ట్రైకోఫోబియా అంటే కింది వాటిలో దేన్ని చూసి భయపడటం?
  1) వెంట్రుకలు 2) సాలెపురుగు
  3) జంతువులు 4) దంతాలు
 17. టాటోనీమ్‌ అంటే?
  1) జాతి, ప్రజాతి ఒకే పేరు కలిగి ఉండటం
  2) రెండు జీవులకు ఒకే పేరు ఉండటం
  3) జాతి, ప్రజాతి వేర్వేరు పేర్లను కలిగి ఉండటం
  4) ఒక జాతిలోని వేర్వేరు ఉపజాతులకు ఒకే పేరు ఉండటం
 18. తేనెటీగ లార్వాను ఏమని పిలుస్తారు?
  1) మూగట్‌ 2) రిగ్లర్‌
  3) టంబ్లర్‌ 4) గ్రబ్‌
 19. సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?
  1) పలాలోపురుగు 2) జలగ
  3) వానపాము 4) ఆఫ్రొడైట్‌
 20. ఫిర్రమోన్స్‌ అంటే?
  1) వృక్ష హార్మోన్స్‌
  2) జీర్ణక్రియను నియంత్రించే జంతు హార్మోన్స్‌
  3) పునరుత్పత్తి శక్తిని ప్రేరేపించే హార్మోన్స్‌
  4) తమ జాతి జీవులను గుర్తించే కీటక హార్మోన్స్‌
 21. మిల్ట్‌ అంటే?
  1) కప్పలు, చేపల శుక్రకణాల సమూహం
  2) కప్పల అండాల సమూహం
  3) చేపల శుక్రకణాల సమూహం
  4) చేపల అండాల సమూహం
 22. కింది వాటిలో వేర్లు లేని మొక్క?
  1) చిక్కుడు 2) బఠాని
  3) గోధుమ 4) ఉల్ఫియా
 23. జన్యువులు ఏ విధంగా అమర్చబడి ఉంటాయి?
  1) క్రోమోజోమ్‌ నిలువునా సమాంతర వరుసల్లో అమర్చబడి ఉంటాయి
  2) క్రోమోజోమ్‌ నిలువునా రేఖియంగా అమర్చబడి ఉంటాయి
  3) సర్పిలాకారంగా అమర్చబడి ఉంటాయి
  4) అస్తవ్యస్తంగా అమర్చబడి ఉంటాయి
 24. పెరాక్సిజోమ్‌ల విధి?
  1) విషపదార్థాలను తొలగించడం
  2) ఆక్సీకరణ చర్యలను జరపడం
  3) ఎ 4) ఎ, బి
 25. వృక్షకణంలో కేంద్రకం మధ్యలో కాకుండా కణకవచానికి దగ్గరగా వస్తుంది ఎందుకు?
  1) పెద్ద మైట్రోకాండ్రియా ఉండటం వల్ల
  2) పెద్దరిక్తిక కణంలోని ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడం
  3) కణంలోని ప్రధానమైన కణాంగాలు కణం మధ్యలో అమరి ఉండటం
  4) పెద్ద ప్లాస్టిడ్‌ల వల్ల
 26. రిక్తికలకు సంబంధించి సరైనది?
  1) వృక్ష, జంతుకణాల్లో రెండింటిలో ఇవి
  కనిపిస్తాయి
  2) జంతుకణాల్లో ఇవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి
  3) లేత వృక్షకణాల్లో ఇవి అధిక సంఖ్యలో ఉండి తర్వాతి దశల్లో అన్ని కలిసి ఒకే పెద్ద రిక్తికగా మారుతాయి
  4) ఏదీకాదు
 27. కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ దేని నుంచి గ్రహిస్తారు?
  1) వేరు 2) కాండం
  3) ఆకులు 4) విత్తనాలు
 28. ‘ట్రకోమా’ అనే వ్యాధి ఏ భాగానికి కలుగుతుంది?
  1) హృదయం 2) మెదడు
  3) ఊపిరితిత్తులు 4) కళ్లు
 29. దేశంలో మొదటిసారి అత్యవసరంగా తయారుచేసిన టీకా మందు?
  1) మలేరియా టీకా మందు
  2) ఎఫ్‌ఎమ్‌డీ టీకా మందు
  3) హెచ్‌బీవీ టీకా మందు
  4) బీసీజీ టీకామందు
 30. గోబర్‌ గ్యాస్‌లో ప్రధాన ఘటకం?
  1) మీథేన్‌ 2) ఈథేన్‌
  3) క్లోరిన్‌ 4) ప్రొఫేన్‌
 31. టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్ష ఏది?
  1) వైడల్‌ పరీక్ష 2) మాంటాక్స్‌
  3) వీడీఆర్‌ఎల్‌ 4) పైవన్నీ
 32. అతినిద్ర వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
  1) సీ-సీ ఈగ 2) శాండ్‌ ఫ్లై
  3) ర్యాట్‌ ైప్లె 4) ఏడిస్‌
 33. కింది వాటిలో వైరస్‌ వ్యాధి కానిది?
  1) నైక్రోసిస్‌
  2) మొజాయిక్‌ తెగులు
  3) పిశాచాల చీపురుకట్ట
  4) ఆపిల్‌ క్రౌన్‌గాల్‌
 34. అల్లం మొక్క ఏ భాగం రూపాంతరం?
  1) వేరు 2) కాండం
  3) పత్రం 4) ఏదీకాదు
 35. అంథాలజీ వేటి అధ్యయనం?
  1) వేర్లు 2) కాండం
  3) పత్రాలు 4) పుష్పాలు

పోషక పదార్థాల లోపం వల్ల వచ్చే వ్యాధులు
ఇనుము ఇనుము లోపం వల్ల రక్తహీనత, ఎర్రరక్తకణాల్లో హిమోగ్లోబిన్‌ లోపం
వల్ల వ్యక్తులు పాలిపోయి ఉండటం, ఆకలి కోల్పోవడం,
త్వరగా అలసిపోవడం జరుగుతుంది.
పొటాషియం హైపోకలెమియా, విపరీతంగా వాంతులు విరేచనాలతో పొటాషియం
కోల్పోవడం, హార్ట్‌బీట్‌ రేటు అధికం కావడం, కిడ్నీలు దెబ్బతినడం,
బలహీనత కండరాల పక్షవాతం.
సోడియం హైపోనట్రేమియా సోడియం నష్టపోవడం, నిర్జలీకరణం, రక్తపోటు తగ్గడం,
శరీర బరువు కోల్పోవడం.
అయోడిన్‌ మామూలు గ్రంథి వాపు, ఆహారంలో అయోడిన్‌ శాతం
తక్కువ కావడం వల్ల థైరాయిడ్‌ వాయడం.

వివిధ రకాలైన జంతువులు- అవి నివసించే ప్రదేశాలు
జంతువులు/మొక్కలు నివసించే ప్రదేశం
కివి/ ఏప్టెరిక్స్‌ న్యూజిలాండ్‌
అపోజమ్‌ సౌత్‌ అమెరికా
కంగారు ఆస్ట్రేలియా
హోలాక్‌ గిబ్బన్‌ ఈశాన్య రాష్ర్టాలు (భారత్‌)
మంచు చిరుత జమ్ముకశ్మీర్‌
స్విఫ్ట్‌ జపాన్‌
కొమిడో డ్రాగన్‌ ఆగ్నేయాసియా
అంబ్లిస్టోమా (సాలమండర్‌) ఉత్తర అమెరికా
పెంగ్విన్స్‌ అంటార్కిటికా (దక్షిణ ధృవం)
సీల్‌, వాల్స్‌ ఆర్కిటిక్‌ ధృవప్రాంతాలు
నెపంథిస్‌ మొక్క అసోం
జాగ్వార్‌ మధ్య అమెరికా
కొడాయిక్‌ ఎలుగుబంటి అలస్కా
హమ్మింగ్‌ బర్డ్‌ క్యూబా
ఆస్ట్రిచ్‌ (నిప్పుకోడి) సహారా ఎడారి
ఒరాంగుటాన్‌ ఆగ్నేయాసియా
పాంగోలిన్‌ ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని ఉష్ణమండల అడవులు
గొరిల్లా మధ్య ఆఫ్రికా
బట్టమేకతల భారత్‌, పాకిస్థాన్‌
పునుగు పిల్లి ఆగ్నేయాసియా

బ్యాక్ట్టీరియా ఉపయోగం
లాక్టోబాసిల్లస్‌ పాలను పెరుగుగా మార్చడం
ఇ కొలై బి12, విటమిన్‌ కే ఫోలిక్‌ ఆసిడ్‌ విటమిన్‌ల తయారీ
స్ట్రెప్టోమైసిన్‌ గ్రీసియస్‌ స్ట్రెప్టోమైసిన్‌ యాంటీబయాటిక్‌
మిథనోకోకస్‌, మిథనోబాసిల్లన్‌ బయోగ్యాస్‌ తయారీ
ఆగ్రోబ్యాక్టీరియం జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లో వాహకంగా
బాసిల్లన్‌ వల్గారిస్‌
బాసిల్లన్‌ రామోసస్‌ ప్రకృతి పారిశుధ్యకారులు
బాసిల్లన్‌ మైకాయిడిస్‌
నైట్రాబాక్టర్‌ నత్రజని వలయంలో
నైట్రోజనోమోనాస్‌
రైజోబియం, అజటోబాక్టర్‌ జీవ ఎరువులుగా
క్లాస్ట్రీడియం, బ్యుటిలికం బ్యుటినాల్‌ ఉత్పత్తి, నారతీసే ప్రక్రియ
రిబోఫ్లావిన్‌ ఉత్పత్తి
స్ట్రెప్టోమైసిన్‌ వెనిజులే క్లోరోమైసిటీన్‌ ఉత్పత్తి
బాసిల్లన్‌ సబ్టిలిస్‌ సబ్‌ టిలిన్‌ ఉత్పత్తి

Answers
1-3, 2-3, 3-2, 4-1, 5-4,6-4, 7-1, 8-3, 9-4, 10-3, 11-2, 12-1, 13-4, 14-3, 15-2, 16-1, 17-1, 18-4, 19-4, 20-4, 21-1, 22-4, 23-2, 24-3, 25-2, 26-3, 27-1, 28-4, 29-3, 30-3, 31-1, 32-1, 33-4, 34-2, 35-4

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?

ట్రెండింగ్‌

Advertisement