e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?

తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?

తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?
 1. భారత్‌లో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి?
  1) తేమతో కూడిన సమశీతోష్ణ మండల పర్వత ప్రాంత అరణ్యాలు
  2) ఉప ఉష్ణ మండల అనార్ధ్ర సతత హరితాలు
  3) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు
  4) ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన సతతహరితాలు
 2. షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి?
  1) హిమాలయాల్లో 1800మీ-3000మీ ఎత్తులో
  2) మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో
  3) పంజాబ్‌ హిమాలయాలు
  4) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీటర్లు అంతకంటే ఎత్తులో
 3. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణం ఎంత శాతం?
  1) 4% 2) 3.2% 3) 1.85% 4) 2.8%
 4. క్రికెట్‌ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప?
  1) సిల్వర్‌ఫర్‌ 2) దేవదారు
  3) విల్లోస్‌ 4) స్ప్రూస్‌
 5. ‘జిమ్‌కార్బెట్‌ జాతీయ పార్క్‌’ ఎక్కడ ఉంది?
  1) ఉత్తరప్రదేశ్‌ 2) ఉత్తరాంచల్‌
  3) అసోం 4) అరుణాచల్‌ప్రదేశ్‌
 6. క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాల్లోని సతతహరితాలు దేశంలో కింది ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?
  1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు
  2) మాంగ్రూవ్స్‌
  3) అనార్ధ్ర సతతహరితాలు
  4) ఆర్ధ్ర ఆకురాల్చే అరణ్యాలు
 7. ఉష్ణమండల వర్ష్షారణ్యాన్ని తొలగించిన, అది ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవితో పోలిస్తే, అంత త్వరగా తిరిగి వృద్ధిచెందదు. ఇందుకు కారణం?
  1) వర్షారణ్యం (Rain forest)లోని నేలలో పోషక పదార్థాలు తక్కువగా ఉండటం
  2) వర్షారణ్యంలోని చెట్ల వ్యాప్తి కణాలు అంతశక్తిమంతంగా ఉండకపోవటం
  3) వర్షారణ్య జాతులు నెమ్మదిగా పెరగడం
  4) వర్షారణ్య ప్రాంతంలోని సారవంతమైన, నేలమీద బాహ్య జాతులు దాడి చేయడం
 8. కింది వాటిని పరిశీలించండి
  ప్రతిపాదన (ఏ): రుతుపవన ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవి కాలంలో
  ఆకు రాల్చుతాయి
  కారణం (ఆర్‌): ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకులను రాల్చుతుంది
  1) ఏ, ఆర్‌ నిజమైనవి. ఏ కు ఆర్‌ సరైన
  వివరణ
  2) ఏ, ఆర్‌ నిజమైనవి. ఏ కు ఆర్‌ సరైన
  వివరణ కాదు
  3) ఏ నిజమైనది, ఆర్‌ నిజమైనది కాదు
  4) ఏ నిజమైనది కాదు, ఆర్‌ నిజమైనది
 9. కింది వాటిలో సవన్నా శీతోష్ణస్థితికి సంబంధించి తప్పుగా ఉన్నది?
  1) దేశంలో వృక్షాలు లేని సవన్నా శీతోష్ణస్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉంది
  2) కర్ణాటక, ఏపీలోని నైరుతి ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన సవన్నా శీతోష్ణస్థితి ఉంది
  3) ఏ ప్రాంతంలోనైతే అనార్ధ్ర ఆకురాల్చే అరణ్యాలు అగ్నిప్రమాదాల వల్ల కాలిపోతాయో ఆ ప్రాంతాలు అనార్ధ్ర సవన్నా ప్రాంతాలుగా మారిపోతాయి
  4) అనార్ధ్ర సవన్నా శీతోష్ణస్థితి ముఖ్యలక్షణం ముళ్లపొదలు, తుప్పలు, గడ్డిజాతులను కలిగి ఉండటం
 10. కింది వాటిని జతపర్చండి.
  ఎ. టేకు 1. సతత హరిత
  బి. యుఫోర్బియా 2. ఆకురాల్చు
  సి. రోజ్‌వుడ్‌ 3. సవన్నా
  డి. సుంద్రీ 4. మాంగ్రూవ్‌
  1) ఎ-2, బి-1, సి-3, డి-4
  2) ఎ-1, బి-2, సి-3, డి-4
  3) ఎ-2, బి-3, సి-1, డి-4
  4) ఎ-1, బి-3, సి-2, డి-4
 11. రైస్‌బౌల్‌ ఆఫ్‌ తెలంగాణ అని ఏ జిల్లాను పిలుస్తారు?
  1) నల్లగొండ 2) ఖమ్మం
  3) కరీంనగర్‌ 4) నిజామాబాద్‌
 12. పెసలు ఉత్పత్తిలో విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా?
  1) రంగారెడ్డి 2) నల్లగొండ
  3) కరీంనగర్‌ 4) ఆదిలాబాద్‌
 13. రాష్ట్రంలో సాంవత్సరిక సగటు వర్షపాతం?
  1) 617 మి.మీ 2) 1212మి.మీ
  3) 715 మి.మీ 4) 906 మి.మీ
 14. పోచారం అభయారణ్యం ఏ జిల్లాలో ఉంది?
  1) మెదక్‌ 2) ఖమ్మం
  3) కొత్తగూడెం 4) ఆదిలాబాద్‌
 15. చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మిషన్‌ కాకతీయ’ క్యాప్షన్‌ ఏది?
  1) మీ ఊరు – మీ చెట్టు
  2) మన ఊరు – మన చెట్టు
  3) మీ చెరువు – మీ చెట్టు
  4) మన ఊరు – మన చెరువు
 16. తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?
  1) నిజామాబాద్‌ 2) సిద్దిపేట
  3) ఆదిలాబాద్‌ 4) ఆసిఫాబాద్‌
 17. జాతీయ రహదారులను అధికంగా కలిగి ఉన్న జిల్లా?
  1) కరీంనగర్‌ 2) మహబూబ్‌నగర్‌
  3) ఆదిలాబాద్‌ 4) వరంగల్‌
 18. జాతీయ రహదారులను తక్కువగా కలిగి ఉన్న జిల్లా?
  1) నల్లగొండ
  2) వరంగల్‌
  3) నిజామాబాద్‌
  4) హైదరాబాద్‌
 19. రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శ్రేణి?
  1) గోలికొండలు 2) మహబూబ్‌ ఘాట్‌
  3) లక్ష్మీదేవిపల్లి కొండ
  4) సత్నాల కొండలు
 20. కింది వాటిలో తప్పుజతను గుర్తించండి?
  1) శివారం-మంచిర్యాల
  2) ఏటూరు-వరంగల్‌
  3) కిన్నెరసాని-ఖమ్మం
  4) మంజీరా- మెదక్‌
 21. ‘గెర్‌’ అడవుల్లో ప్రసిద్ధిచెందిన జంతువు?
  1) పులులు 2) జింకలు
  3) ఏనుగులు 4) సింహాలు
 22. దేశంలోని అత్యధికంగా నిరుపయోగమైన భూమి విస్తరించి ఉన్న ప్రాంతం?
  1) మధ్యప్రదేశ్‌ 2) అరుణాచల్‌ప్రదేశ్‌
  3) ఉత్తరప్రదేశ్‌ 4) జమ్ము కశ్మీర్‌
 23. పులి రాష్ట్రంగా దేన్ని పిలుస్తారు?
  1) ఛత్తీస్‌గఢ్‌ 2) మధ్యప్రదేశ్‌
  3) ఏపీ 4) అసోం
 24. నేలల పుట్టుక, వర్ణన, వాటి భౌతిక రసాయనిక లక్షణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగం?
  1) ఎడఫాలజీ 2) లిథాలజీ
  3) పెడాలజీ 4) జియాలజీ
 25. నీటి పారుదల తక్కువగా అవసరమయ్యే నేలలు?
  1) ఒండ్రుమట్టి 2) నల్లరేగడి
  3) ఎర్రనేలలు 4) లేటరైట్‌ నేలలు
 26. దేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందుతాయి?
  1) పోడ్జెల్స్‌ 2) టెర్రరోసా
  3) లేటరైటిక్‌ 4) చెర్నోజైమ్‌
 27. దేశంలో కందర భూములు ఎక్కడ ఉన్నాయి?
  1) ఉత్తరప్రదేశ్‌లోని యమునా నదీ లోయప్రాంతంలో
  2) మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ నదీలోయ ప్రాంతంలో
  3) గుజరాత్‌లోని మహీ నదీలోయ ప్రాంతంలో
  4) పైవన్నీ
 28. అల్లం, మిరియాలు అధికంగా పండించే రాష్ట్రం?
  1) తమిళనాడు 2) పశ్చిమబెంగాల్‌
  3) కర్ణాటక 4) మధ్యప్రదేశ్‌
 29. పోడు వ్యవసాయం ఇంకా ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం?
  1) కేరళ 2) ఒడిశా
  3) ఉత్తరప్రదేశ్‌ 4) గోవా
 30. అంకలేశ్వర్‌ దేనికి ప్రసిద్ధి?
  1) చమురు నిల్వలు
  2) పత్తి మిల్లులు
  3) గోధుమ ఉత్పత్తి
  4) చర్మం వస్తువులు
తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?

ట్రెండింగ్‌

Advertisement