బుధవారం 12 ఆగస్టు 2020
Nipuna-education - Jul 06, 2020 , 07:02:40

అక్టోబర్‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం!

అక్టోబర్‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలను ప్రకటించనుంది. దీంతోపాటు కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ను కూడా విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ, యూజీసీ నిబంధనలు ఇలా ఉండవచ్చని నివేదికలు అందుతున్నాయి. 

వాటి ప్రకారం.. 2019-20 విద్యా సంవత్సరం చివరి పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలను రద్దు చేయడం లేదా మరికొంతకాలం వాయిదా వేయవచ్చు. అక్టోబర్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించే అవకాశం ఉన్నది. కాగా ఇప్పటికే పలు రాష్ర్టాలు బోర్డు పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా యూజీ, పీజీ చివరి ఏడాది పరీక్షలను రద్దు చేసింది.

తాజావార్తలు


logo