శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 03, 2020 , 14:52:23

నీట్ ఎస్ఎస్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం... సెప్టెంబ‌ర్ 15న ప‌రీక్ష‌

నీట్ ఎస్ఎస్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం... సెప్టెంబ‌ర్ 15న ప‌రీక్ష‌

న్యూఢిల్లీ: ‌వైద్య‌విద్య‌లో సూప‌ర్ స్పెషాలిటీ కోర్సులైన డీఎం లేదా ఎంసీహెచ్‌లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే  నీట్ సూప‌ర్ స్పెషాలిటీ (నీట్ఎస్ఎస్‌)- 2020 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ అర్హ‌త ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15న జ‌ర‌గనున్న‌ది. ఈ ప‌రీక్షను నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ నిర్వ‌హించ‌నున్న‌ది. నీట్ ఎస్ఎస్ ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ www.nbe.edu.inలో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డిచింది. డెమో ప‌రీక్ష‌ను సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. వ‌చ్చే నెల 7 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఫ‌లితాల‌ను సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్నారు.  

ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా ఎయిమ్స్ న్యూఢిల్లీ, జిప్‌మ‌ర్ పుదుచ్చేరి, పీజీఐమ‌ర్ చండీగ‌ఢ్‌, నిమ్‌హాన్స్ బెంగ‌ళూరులో మిన‌హా దేశ‌వ్యాప్తంగా అన్ని మెడిక‌ల్‌ కాలేజీల్లో డీఎం, ఎంసీహెచ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

తాజావార్తలు


logo