బుధవారం 08 జూలై 2020
Nipuna-education - Jun 04, 2020 , 13:25:07

ప్రారంభమైన నీట్‌ పీజీ రెండో విడత కౌన్సెలింగ్‌

ప్రారంభమైన నీట్‌ పీజీ రెండో విడత కౌన్సెలింగ్‌

న్యూఢిల్లీ: నీట్‌ పీజీ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రెండో విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజును జూన్‌ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు చెల్లించవచ్చు. అదేవిధంగా జూన్‌ 4 నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు అప్లికేషన్‌ ఫామ్‌లను సమర్పించవచ్చు. జూన్‌ 10, 11వ తేదీల్లో విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. జూన్‌ 12న ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు విడుదలైన ఆరు రోజుల్లోపు అంటే జూన్‌ 18 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 

పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ అధికారిక వైబ్‌సైట్‌ www.mcc.nic.in ద్వారా లాగిన్‌ కావాల్సి ఉంటుంది.logo