గురువారం 02 జూలై 2020
Nipuna-education - Mar 28, 2020 , 14:19:09

నీట్ 2020 వాయిదా - ఎన్టీఏ

నీట్ 2020 వాయిదా - ఎన్టీఏ

దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, అయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) (యుజి మే) -2020 వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. నీట్‌-2020 పరీక్ష మే 3న జరగాల్సి ఉంది. కోవిడ్‌-19 మహ్మరితో దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం విదితమే.  దీంతో పరీక్షను మే చివరి వారంలో నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. కరోనా తీవ్రతను బట్టి పరీక్ష నిర్వహణపై అంతిమ నిర్ణయం ఆధారపడి ఉంటుందిని తెలిపింది. పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్‌ 15 తర్వాత అడ్మిట్‌కార్డులను విడుదల చేస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. అకడమిక్‌ షెడ్యూల్‌ ఎంత ముఖ్యమో ప్రజలు, విద్యార్థుల శ్రేయస్సు కూడా ముఖ్యమేన‌ని ఎన్‌టీఏ ప్రకటించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు పరీక్ష గురించిన ఆందోళన పడకుండా ఈ విలువైన సమయాన్ని ముఖ్యమైన కాన్సెప్ట్‌లను ప్రిపేర్ కావడానికి వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పొందుపరస్తామని, అనవసర వదంతులు నమ్మవద్దని పేర్కొంది. నీట్‌-2020 సమాచారం కోసం https://ntaneet.nic.in చూస్తుండమని ఎన్‌టీఏ తెలిపింది. 



logo