గురువారం 01 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 13, 2020 , 11:20:03

ఈనెల 29న హోట‌ల్ మేనేజ్‌మెంట్ జేఈఈ

ఈనెల 29న హోట‌ల్ మేనేజ్‌మెంట్ జేఈఈ

న్యూఢిల్లీ: ‌హోట‌ల్ మేనేజ్‌మెంట్ జేఈఈ ప‌రీక్ష తేదీని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రక‌టించింది. హాస్పిటాలిటీ, హోట‌ల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ కేట‌రింగ్ టెక్నాల‌జీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేష‌న్ (ఎన్‌సీహెచ్ఎంసీటీ-జేఈఈ) ఈ నెల 29న నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. హాల్‌టికెట్ల‌ను ప‌రీక్ష‌కు 15 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని వెల్ల‌డించింది. ఈ కంప్యూట‌ర్ బేస్ట్ ప‌రీక్ష ఆగ‌స్టు 29న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ జ‌రుగుతుంద‌ని తెలిపింది. ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను ఎన్‌టీఏ నిర్వ‌హిస్తున్న‌ది. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కోసం nta.ac.in, nchmjee.nta.nic.in వెబ్‌సైట్ల‌లో చూడాల‌ని పేర్కొంది. 


logo