మంగళవారం 01 డిసెంబర్ 2020
Nipuna-education - Sep 05, 2020 , 11:31:15

నాటా మొద‌టి ప‌రీక్ష‌ ఫ‌లితాల విడుద‌ల

నాటా మొద‌టి ప‌రీక్ష‌ ఫ‌లితాల విడుద‌ల

న్యూఢిల్లీ: ఆర్కిటెక్చ‌ర్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించే నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చ‌ర్ (నాటా) మొద‌టి విడ‌ద ప‌రీక్ష‌ ఫ‌లితాల‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్ (సీఓఏ) ప్ర‌క‌టించింది. ఫ‌లితాల‌ను అధికారిక‌ వెబ్‌సైట్ nata.inలో చూడ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. నాటా మొద‌టి ప‌రీక్షను ఆగ‌స్టు 29న నిర్వ‌హించింది.

నాటా ప‌రీక్ష‌ను ఏటా రెండుసార్లు నిర్వ‌హిస్తారు. మొద‌టి ప‌రీక్ష ఇప్ప‌టికే ముగియ‌గా, రెండో విడ‌త‌ ప‌రీక్షను ఈనెల 12న నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించిన ద‌ర‌ఖాస్తు గ‌డువు రేప‌టితో ముగియ‌నుంది.