శుక్రవారం 05 మార్చి 2021
Nipuna-education - Jan 17, 2021 , 10:28:25

డెంటల్‌ సీట్ల భర్తీకి అద‌నపు కౌన్సె‌లింగ్‌

డెంటల్‌ సీట్ల భర్తీకి అద‌నపు కౌన్సె‌లింగ్‌

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో కన్వీ‌నర్‌ కోటా సీట్ల భర్తీకి అద‌నపు మాప్‌ అప్‌ కౌన్సె‌లింగ్‌ నోటి‌ఫి‌కే‌ష‌న్‌ను కాళోజీ హెల్త్‌ యూని‌వ‌ర్సిటీ విడు‌ద‌ల‌చే‌సింది. ఆదివారం నుంచి ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసు‌కో‌వా‌లని అభ్యర్థులకు సూచించింది. వర్సిటీ విడు‌ద‌ల‌చే‌సిన తుది మెరిట్‌ జాబి‌తా‌లోని అర్హు‌లైన అభ్యర్థులు ఈ విడుత కౌన్సె‌లిం‌గ్‌లో పాల్గొ‌న‌వ‌చ్చని తెలి‌పింది. వివ‌రా‌లకు వర్సిటీ వెబ్‌‌సై‌ట్‌ http://www.knruhs.telangana.gov.inను చూడవచ్చని తెలిపింది.

ఆయుష్‌ సీట్లకు.. 

నీట్‌ యూజీ అర్హత కటాఫ్‌ స్కోరును కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ 10 పర్సంటైల్‌ తగ్గిం‌చిన నేప‌థ్యంలో కటాఫ్‌ స్కోర్‌ ఆధా‌రంగా అర్హు‌లైన అభ్యర్థులు దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని హెల్త్‌ యూని‌వ‌ర్సిటీ కోరింది. ఆయుష్‌ సీట్ల దర‌ఖా‌స్తుకు ఈ నెల 20 తుది గడువు విధిస్తూ నోటి‌ఫి‌కే‌షన్‌ జారీ‌చే‌సింది. పూర్తి వివ‌రా‌లకు వర్సిటీ వెబ్‌‌సైట్‌ సంద‌ర్శిం‌చా‌లని సూచిం‌చింది.

VIDEOS

logo