బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 25, 2020 , 12:54:52

హెచ్ఏఎల్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు

హెచ్ఏఎల్‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు

న్యూఢిల్లీ: ప‌్ర‌భుత్వ‌రంగ సంస్థ హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌) ఖాళీగా ఉన్న మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. వ‌చ్చేనెల 20లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

మొత్తం పోస్టులు: 11

ఇందులో సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్-8 (మెడిసిన్-4, ఓబీ అండ్ జీ-2, స‌ర్జ‌రీ-1, ఆర్థోపెడిక్‌-1), మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-3

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగంలో ఎండీ లేదా డీఎన్‌బీ, డీజీఓ లేదా డీఎన్‌బీ, ఎమ్మెస్ లేదా డీఎన్‌బీ, ఆర్థో లేదా ఎమ్మెస్ లేదా డీఎన్‌బీ, ఎంబీబీఎస్ చేసి ఉండాలి. 45 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత చిరునామాకు పంపించాలి. 

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 20

వెబ్‌సైట్‌: hal-india.co.in


logo