శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 29, 2020 , 13:24:21

నైనిటాల్ బ్యాంక్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు

నైనిటాల్ బ్యాంక్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు

హైద‌రాబాద్‌: నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేనెల 23 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 15 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

అర్హ‌త‌: ‌గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం నుంచి 50 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే మార్కెటింగ్ అండ్ సేల్స్ స్పెష‌లైజేష‌న్‌తో డిగ్రీ లేదా పీజీ చేసిన‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలిపింది. అదేవిధంగా హిందీ, ఇంగ్లిష్ తెలిసి కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. సెప్టెంబ‌‌ర్ 30 నాటికి 20 నుంచి 30 ఏండ్ల‌లోపువారై ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. హార్డ్ కాపీకి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి. 

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 23

వెబ్‌సైట్‌: nainitalbank.co.in

తాజావార్తలు