గురువారం 24 సెప్టెంబర్ 2020
Nipuna-education - Aug 14, 2020 , 12:21:37

ఎల్‌శాట్ ఇండియా ఫ‌లితాలు విడుద‌ల‌

ఎల్‌శాట్ ఇండియా ఫ‌లితాలు విడుద‌ల‌

న్యూఢిల్లీ: వివిధ యూనివ‌ర్సిటీలు, లా స్కూళ్ల‌లో ‌డిగ్రీ, పీజీ న్యాయ విద్య కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే లా స్కూల్ అడ్మిష‌న్ టెస్ట్ (ఎల్‌శాట్‌) ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ప‌రీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ discoverlaw.excelindia.com/LSATలో చూడ‌వ‌చ్చ‌ని లా స్కూల్ అడ్మిష‌న్ కౌన్సిల్ (ఎల్ఎస్ఏసీ‌) వెల్ల‌డించింది. 

ఎల్‌శాట్ ప‌రీక్ష‌ను జూలై 19 నుంచి 26 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో నిర్వ‌హించారు. దీనికోసం 6651 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ఆరువేల మంది విద్యార్థులు ప‌రీక్ష రాశారు. ఎల్‌శాట్‌లో అజిమ్ ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీ, ఓపీ జింగాల్ గ్లోబ‌ల్ యూనివ‌ర్సిటీ, జాగ‌ర‌న్ లేక్‌సిటీ యూనివ‌ర్సిటీ, ఎన్ఏ గ్లోబ‌ల్ లా స్కూల్‌, ఏఐఎస్ఈసీడీ వ‌ర్సిటీ, ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా, జీడీ గోయెంకా యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ లా, అలియ‌న్స్ యూనివ‌ర్సిటీ, ఎన్ఎంఐఎంఎస్ స్కూల్ ఆఫ్ లా, సెంట్ర‌ల్ ఇండియా కాలేజ్ ఆఫ్ లా, కాలేజ్ ఆఫ్ లీగ‌ల్ స్ట‌డీస్ (యూపీఈఎస్‌), ఐసీఎఫ్ఏఐ యూనివ‌ర్సిటీ, ఎన్‌సీయూ లా స్కూల్‌, గీతం యూనివ‌ర్సిటీ, నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌, అన్సాల్ వ‌ర్సిటీ, శార్దా వ‌ర్సిటీ, వీఐటీ లా స్కూల్‌, ఎస్ఆర్ఎం వ‌ర్సిటీలు పాల్గొంటున్నాయి. ఇందులో వ‌చ్చిన మ్కార్కుల ఆధారంగా యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్నాయి.


logo