గురువారం 25 ఫిబ్రవరి 2021
Nipuna-education - Jan 27, 2021 , 07:16:07

ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీ‌టీ‌ దర‌ఖా‌స్తు గడువు

ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీ‌టీ‌ దర‌ఖా‌స్తు గడువు

హైద‌రా‌బాద్‌: ఎమ్మెస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్‌ యూని‌వ‌ర్సిటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌ద‌ల‌చే‌సింది. బుధ‌వారం సాయంత్రం 5 గంట‌లతో ఆన్‌‌లైన్‌ దర‌ఖా‌స్తుల ప్రక్రియ ముగు‌స్తుం‌దని స్పష్టం‌చే‌సింది. దర‌ఖాస్తు చేసు‌కున్న అభ్యర్థుల ఆధా‌రంగా ప్రొవి‌జ‌నల్‌ మెరిట్‌ లిస్టును విడు‌ద‌ల‌ చే‌స్తా‌మని తెలి‌పింది. ధ్రువ‌ప‌త్రాల పరి‌శీ‌లన అనం‌తరం తుది మెరిట్‌ జాబి‌తాను వెల్లడి‌స్తా‌మని పేర్కొ‌న్నది. అర్హు‌లైన అభ్యర్థులు ఈ నెల 28న ధ్రువ‌ప‌త్రాల పరి‌శీ‌లన కోసం హైద‌రా‌బా‌ద్‌‌లోని ప్రొఫె‌సర్‌ జీ రాంరెడ్డి దూర విద్యా కేంద్రా‌నికి రావా‌లని తెలి‌పింది. ఇతర సమా‌చారం కోసం వెబ్‌‌సై‌ట్‌ను సంద‌ర్శిం‌చా‌లని సూచించింది.

VIDEOS

logo