ఆదివారం 25 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 12, 2020 , 12:08:45

కేవీఎస్ ఒక‌టో త‌ర‌గ‌తి మెరిట్ లిస్ట్ విడుద‌ల‌

కేవీఎస్ ఒక‌టో త‌ర‌గ‌తి మెరిట్ లిస్ట్ విడుద‌ల‌

న్యూఢిల్లీ: ‌కేంద్రీయ విద్యాల‌య్యాల్లో 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించిన ఒక‌టో త‌ర‌గ‌తి మొద‌టి విడ‌‌త మెరిట్ లిస్టును కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ (కేవీఎస్‌) విడుద‌ల చేసింది. ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.inలో అందుబాటులో ఉంచామ‌ని, విద్యార్థుల త‌ల్లిదండ్రులు చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది. 

మొద‌టి విడ‌త జాబితాలో పేర్లు లేని విద్యార్థులు రెండు, మూడో జాబితా కోసం వేచిచూడాల‌ని వెల్ల‌డిచింది. రెండోవిడ‌త మెరిట్ జాబితాను ఆగ‌స్టు 24న‌, మూడో జాబితాను ఈ నెల 28న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

మొద‌టి లిస్టులో పేర్లుండి, అడ్మిష‌న్ పొందాల‌నుకునే విద్యార్థులకు సంబంధించిన బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌, మొబైల్ నంబ‌ర్‌, ఈ-మెయిల్‌, డిజిట‌ల్ ఫొటోగ్రాఫ్, ఈడ‌బ్ల్యూఎస్ స‌ర్టిఫికెట్‌, టీసీ వంటి వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో పంపించాల‌ని సూచించింది.     ‌


logo