హైదరాబాద్: సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 5 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇంటర్ చదివినవారు ఈ పోస్టులకు అర్హులని తెలిపింది.
మొత్తం పోస్టులు: 6
ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) 4, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎఫ్ అండ్ ఏ) 1, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్ పీ) 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. నిబంధనల ప్రకారం ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష లేదా టైపింగ్ టెస్ట్. అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇలా ఎంపికచేసినవారిని రాతపరీక్షకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: మే 5
వెబ్సైట్: http://www.ccmb.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..