హైదరాబాద్: నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్మత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ, జూనియర్ ఆర్టిసన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎంపికైనవారు కర్ణాటకలోని మైసూరులో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 50
ఇందులో సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ 8 (కెమికల్ 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, ఎలక్ట్రికల్ 1), జూనియర్ ఆర్టిసన్ 42 (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 8, ఎలక్ట్రికల్ 11, ఫిట్టర్ 5, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 18) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ పోస్టుకు.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. కెమికల్ డిసిప్లేన్స్ కోసం.. డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్టు చేయాలి.
జూనియర్ ఆర్టిసన్ పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేయాలి. కెమికలల్ ప్లాంట్ ఆపరేటర్ కోసం ఇంటర్లో ఎంపీసీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: వెబ్సైట్లో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పరీక్ష రోజున నేరుగా హాజరవ్వాలి.
పరీక్ష తేదీ: జూలై 7
వెబ్సైట్: http://www.ecil.co.in/