శనివారం 04 జూలై 2020
Nipuna-education - Jun 04, 2020 , 20:09:43

ఈ నెల‌ 20 నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షలు

ఈ నెల‌ 20 నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంజినీరింగ్‌, పరీక్షలపై జేఎన్‌టీయూహెచ్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో బీటెక్‌, బీ ఫార్మసీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది.

పరీక్ష సమయం రెండు గంటలే ఉంటుందని వెల్లడించింది. ఇరవై నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ విద్యాసంవత్సరంలో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లోనే పరీక్షలు రాసుకోవచ్చని వెల్లడించింది. ఒకవేల పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.


logo