మంగళవారం 01 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 14, 2020 , 13:30:14

బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ విడుద‌ల‌

బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు.. ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ విడుద‌ల‌

హైద‌రాబాద్‌: బీబీ న‌గ‌ర్ ఎయిమ్స్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన ఇంట‌ర్వ్యూ షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. ఈ నెల 26 నుంచి ఇంట‌ర్వ్యూలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పుదుచ్చేరిలోని జిప్‌మ‌ర్ ప్ర‌క‌టించింది. వీటికి సంబంధించిన షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్ jipmer.edu.inలో ఉంద‌ని తెలిపింది. ఇంట‌ర్వ్యూల‌కు ఎంపికైన‌ అభ్య‌ర్థులు సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను తీసుకుని రావాల‌ని సూచించింది. ఇంటర్వ్యూల‌ను బీబీ న‌గ‌ర్ ఎయిమ్స్‌లో నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. అయితే ఇంటర్వ్యూకి వ్య‌క్తిగ‌తంగా లేదా వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యే విష‌యాన్ని ముందుగానే తెలపాల‌ని సూచించింది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.