బుధవారం 28 అక్టోబర్ 2020
Nipuna-education - Aug 22, 2020 , 15:23:26

ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్ హాల్‌టికెట్లు

ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్ హాల్‌టికెట్లు

న్యూఢిల్లీ: ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు అయిన‌ ‌జాయిట్ ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్ (జేఈఈ) మెయిన్‌, నేష‌న‌ల్ ఎంట్రెన్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్‌) అడ్మిట్ కార్డులు లేదా హాల్‌టికెట్ల‌ను ఎన్‌టీఏ విడుద‌ల చేసింది. హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్లు jeemain.nta.nic.in, nta.neet.nic.inలో అందుబాటులో ఉన్నాయ‌ని, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్ర‌క‌టించింది. ప‌రీక్ష‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌ని తెలిపింది. 

జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ వ‌చ్చే నెల 27న జ‌ర‌గ‌నుంది.  


logo