ప్రకటన: సచిన్‌ను మేనేజర్ తన సహచరుల వద్ద కించపరిచెను. తీర్మానాలు I: మేనేజర్‌కు సచిన్ అంటే పడదు II: సచిన్ గొప్పతనం అతని సహచరులకు తెలియదు
ప్రకటన: ‘క్రాఫ్ట్ రంగులను ఉపయోగించండి, మీ జీవితాన్ని వెలుగులతో నింపండి’ అనేది ఒక ప్రకటన. తీర్మానాలు I: ఆకట్టుకునే నినాదాలు ప్రజలను ఆకర్షించలేవు II: ప్రజలకు కృష్ణ రంగులు ఇష్టం
ప్రకటన: శుక్రవారం మరమ్మతలు జరగడం వల్ల ఎ, బి వార్డుల్లో 50 శాతం వరకు నీటి సరఫరాపై ప్రభావం చూపును. తీర్మానాలు I: ఈ వార్డులోని ప్రజలు శుక్రవారం నీటిని పొదుపుగా వాడుకోవాలి II: అంతకుముందు రోజే కొంతనీటిని స్టోర్ చేసుకోవాలి
ప్రకటన: వరకట్నానికి వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడిన వారే వరకట్నం తీసుకుంటారు. తీర్మానాలు I: చేతలకంటే మాటలు తేలిక II: ప్రజలవి ద్వంద్వ ప్రమాణాలు
ప్రకటన: జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి 1000 జనాభాకు 100 పడకలు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో 150 పడకలు ఉన్నాయి. తీర్మానాలు I: మన జాతీయ నిబంధనలు తగిన విధంగా ఉన్నాయి II: ఈ రాష్ట్రం ఆరోగ్యంపై మంచి శ్రద్ధ పెట్టింది
ప్రకటన: శీతాకాలంలో వర్షాలు పంటలకు మంచిది. తీర్మానాలు I: శీతాకాలంలో మంచి నాణ్యతగల పంటలు పండుతాయి II: మిగిలిన కాలంలో వర్షాలు పంటలను పాడుచేస్తాయి.
ప్రకటన: రాజకీయాల్లో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. I: పేదవారు ఎప్పటికీ రాజకీయ నాయకులు కాలేరు II: ధనవంతులు అందరూ రాజకీయాల్లో ఉంటున్నారు
ప్రకటన: కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీర్మానాలు I: కూరగాయలు అరుదైన వస్తువుగా మారిపోతున్నాయి II: ప్రజలు కూరగాయలు తినలేరు
ప్రకటన: విద్యార్థిగా స్కూల్లో సరైన ప్రవర్తన లేకపోతే అతను తనకు, స్కూల్‌కు కూడా చెడ్డపేరు తీసుకువస్తాడు. I: అటువంటి విద్యార్థులను స్కూల్ నుంచి పంపించి వేయాలి II: కొందరికి ప్రపంచం చాలా చెడ్డగా కనిపిస్తుంది
ప్రకటన: మంచి గాయకులను మాత్రమే సమావేశానికి పిలిచారు. తియ్యని స్వరం లేకపోతే మంచి గాయకులు కాలేరు. తీర్మానాలు I: సమావేశంలోని అందరి గాయకులకు తియ్యని స్వరం ఉంది II: తియ్యని స్వరంలేని వారిని సమావేశానికి ఆహ్వానించలేదు ప్రకటనలు- వాదనలు
వాదన 1 బలమైనది
వాదన 2 బలమైనది
రెండు వాదనలు బలమైనవి కావు
రెండు వాదనలు బలమైనవి
ప్రకటన: భారత్ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీ నిర్వహించవచ్చా? తీర్మానాలు I: అవును, ఎందుకు నిర్వహించకూడదు II: కాదు, భారత్ ఫుట్‌బాల్ టీం బలమైనది కాదు
ప్రకటన: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? తీర్మానాలు I: అవును, అది మంచి లాభాలనిస్తుంది II: కాదు, అది బలహీనతగా మారుతుంది
ప్రకటన: టీవీ యాంకర్లను టీచర్లుగా చేయాలా? తీర్మానాలు I: అవును, టీవీ యాంకర్లకు చాలా ప్రజాదరణ ఉంది II: కాదు, టీవీ యాంకర్లకు విషయ జ్ఞానం ఉండదు
ప్రకటన: రోడ్లపై ప్రతి కిలోమీటరుకు మెటల్ డిటెక్టర్‌ను బిగించాలా? తీర్మానాలు I: కాదు, అది చాలా ఖరీదైన విషయం II: అవును, టెర్రరిస్ట్ ఎటాక్‌లు పెరిగిపోతున్నాయి
ప్రకటన: కాలేజీలు, యూనివర్శిటీల్లో స్టూడెంట్స్ యూనియన్లు ఉండాలా? తీర్మానాలు I: కాదు, దీనివల్ల కాలేజీల్లో రాజకీయ వాతావరణం నెలకొంటది II: అవును, ఇది చాలా అవసరం. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు
ప్రకటన: కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలా? తీర్మానాలు I: కశ్మీర్ చాలా అందమైన రాష్ట్రం. కశ్మీర్ ద్వారా ఇండియాకు చాలా ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం వస్తుంది II: అవును, దీనివల్ల ఇరుదేశాల మధ్య గొడవలు లేవు
ప్రకటన: గ్రామీణ భారతంలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలా? తీర్మానాలు I: అవును, గ్రామీణ ప్రజలు చాలా సృజనాత్మకత కలిగి ఉన్నారు II: అవును, దీనివల్ల కొంతవరకు నిరుద్యోగం తగ్గించవచ్చు
ప్రకటన: ఐదవ తరగతి వరకు వార్షిక పరీక్షలను రద్దుచేయాలా? తీర్మానాలు I: అవును, చిన్న పిల్లలపై పరీక్షల భారం పెడితే వారి సహజసిద్ధమైన పెరుగుదల ఆగిపోతుంది II: కాదు, వారు సరైన శ్రద్ధతో నడవకపోవడం వల్ల అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది
ప్రకటన: విదేశాల్లో పనిచేస్తున్న భారత సైంటిస్టులను వెనుకకు రప్పించాలా? తీర్మానాలు I: అవును, వారు మొదటగా దేశం కోసం పనిచేయాలి. తర్వాత ఇతర గౌరవాలు అనే విషయం గుర్తుంచుకోవాలి II: లేదు, మనకు చాలా మంది ఉన్నారు. వాళ్లు ఎక్కడుంటే అక్కడ ఉండనివ్వాలి
ప్రకటన: దేశంలో చట్టసభల ఎలక్షన్లో పోటీ చేయడానికి గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలుగా విధించాలా? తీర్మానాలు I: అవును, మనుషులు 65 సంవత్సరాలు దాటిన తర్వాత వారి శక్తిశీలత, దృఢనిశ్చలత కోల్పోతారు II: కాదు, జీవన కాలం పెరగడం వల్ల మనుషులు 80 సంవత్సరాల వరకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు ప్రకటనలు- ఊహలు (Statements- Assumptions) 1.ప్రవచనాలు: ఊహ 1 మాత్రమే అంతర్లీనంగా ఉంది
ఊహ 2 మాత్రమే అంతర్లీనంగా ఉంది
ఏ ఉహ అంతర్లీనంగా లేదు
రెండు ఊహలు అంతర్లీనంగా ఉన్నాయి
ప్రకటన: ‘ఒకసారి అమ్మిన వస్తువులు మార్చబడవు’ నోటీసు ఊహలు I: ఖాతాదారులు నోటీసుకు కట్టుబడి ఉండాలి II: కొందరు తాము కొన్న వస్తువులను మార్చుకొనేందుకు వస్తారు
ప్రకటన: ఆపరేషన్ తర్వాత రోగిస్థితి మెరుగు పడుతుంది ఊహలు I: ప్రస్తుత పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయవచ్చు II: ప్రస్తుత పరిస్థితిలో రోగికి ఆపరేషన్ చేయకూడదు
ప్రకటన: ‘నీవు అల్లరి చేసి నన్ను ఇబ్బంది పెడితే ఒక్కటిస్తా’ అని బిడ్డతో తల్లి అన్నది ఊహలు I: తల్లి ఇలా బెదిరించడం వల్ల బిడ్డ అల్లరి మానుతాడు II: పిల్లలందరూ అల్లరివారే
ప్రకటన: ఆరు నెలలకే మీ సొమ్ము రెట్టింపు.. ఒక ప్రకటన ఊహలు I: ఈ ప్రకటన సరైనది కాదు II: ప్రజలు తమ డబ్బు వృద్ధి చెందాలని కోరుకుంటారు
ప్రకటన: నేను ఎప్పుడూ 9 PM వార్తలు రేడియోలో వింటూ తాజా సమాచారం తెలుసుకుంటాను ఊహలు I: ఈ వ్యక్తి వార్తా పత్రికలు చదవడు II: తాజా వార్తలను రేడియోలో మాత్రమే ప్రసారం చేస్తారు
ప్రకటన: ఈ విషయం పై అంత గొప్ప పుస్తకం ఇంతవరకు రాలేదు ఊహలు I: ఈ విషయం పై మరికొన్ని పుస్తకాలు ఉన్నాయి II: మీరు అతి కొద్ది విషయాల పైనే గొప్ప పుస్తకాలు రాయగలరు
ప్రకటన: ఒక పత్రికలో ప్రకటన ఇలా ఉన్నది.. ‘మీరు మా షాప్‌లో కొంటే మీ డబ్బుకు సరైన విలువ దొరుకుతుంది’ ఊహలు I: వేరే షాపుల్లో కొన్ని వస్తువుల ధరలు వాటి విలువ కంటే ఎక్కువ II: ప్రజలు తమ డబ్బుకు పూర్తి విలువ పొందాలని అనుకుంటారు
ప్రకటన: ఉద్యోగుల సమ్మె జరుగుతున్నందున నగరంలో ప్రైవేటు బస్సు సర్వీస్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది ఊహలు I: సమ్మె చేయడం అనేది ప్రతి ఉద్యోగి హక్కు అయిపోయింది II: ప్రజలకు ఇంకా ప్రైవేటు బస్సు సర్వీస్ అవసరం లేదు
ప్రకటన: ఈ కెమెరాను మీరు దొంగిలించడానికి ప్రయత్నించండి.. అని ఒక డిపార్టుమెంట్ స్టోర్లోనోటీస్ పెట్టారు ఊహలు I: ప్రజలు కెమెరాను కావాలనుకుంటారు II: ఈ స్టోర్‌లో దొంగతనం కనుగొనడానికి సీసీ కెమెరాలను అమర్చారు
ప్రకటన: అవమానంతో జీవిస్తారు ఊహలు: I: చాలా మంది అవమానంతో జీవిస్తారు II: జీవితంలో గౌరవాలు, అవమానాలు రెండూ ఉంటాయి III: అవమానంతో జీవించడం చాలా దుర్భరమైనది అన్నీ అంతర్లీనంగా ఉన్నాయి I: 2, 3 మాత్రమే అంతర్లీనంగా ఉన్నాయి II: 1, 3 మాత్రమే అంతర్లీనంగా ఉన్నాయి III: 2 మాత్రమే అంతర్లీనంగా ఉంది వివరణలు
I: పాటించదు. మేనేజర్ సచిన్‌ను కించపరిచినంత మాత్రాన అతనికి సచిన్ అంటే పడదనుకోనక్కర్లేదు II: పాటించదు. ఎందుకంటే సచిన్ గొప్పతనం గురించి ఇచ్చిన ప్రవచనంలో లేదు
I: పాటించదు. ఇచ్చిన ప్రవచనానికి వ్యతిరేకమైన తీర్మానం II: పాటించదు. ప్రజలకు ఇష్టమైన రంగుల గురించి ఎక్కడా చెప్పలేదు
I: నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం పొదుపుగా వాడుకోవాలనే తీర్మానం సరైనది II: ముందు ప్రకటించారు. అంటే ముందు జాగ్రత్తలు తీసుకోమని అర్థం. అంటే అంతకుముందు రోజు స్టోర్ చేసుకోవడమనేది సరైన తీర్మానం
I: ఇచ్చిన ప్రవచనం నుంచి ‘చేతలకంటే మాటలు తేలిక’ అనేది సరైన తీర్మానం. II: 1, 2 తీర్మానాల అర్థం ఒక్కటే. కాబట్టి ఇది కూడా పాటిస్తుంది
I: పాటించదు. మిగతా రాష్ర్టాల్లో తెలియకుండా జాతీయ నిబంధనల గురించి మాట్లాడలేం II: అవసరమైన పడకల కంటే ఎక్కువ పడకలు ఉన్నాయంటే ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టినట్లు, కాబట్టి ఈ తీర్మానం సరైంది
I: పాటించదు. ఎందుకంటే తీర్మానంలో వర్షాల గురించి లేదు II: పాటించదు. శీతాకాల వర్షాలు మంచివంటే మిగిలిన కాలాల్లో వర్షాల వల్ల నష్టమని కాదు
I: పాటించదు. డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తున్న మాత్రాన పేదవారెవరూ రాజకీయ నాయకులు కాలేరని కాదు II: పాటించదు. ఎందుకంటే కూరగాయలు తినే విషయం గురించి ఇక్కడ లేదు
I: పాటించదు. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయన్నారు. కానీ కూరగాయల లభ్యత గురించి చెప్పలేదు II: పాటించదు. ఎందుకంటే కూరగాయలు తినే విషయం గురించి ఇక్కడ లేదు
I: పాటించదు. ఎందుకంటే ప్రవర్తన గురించిన ప్రవచనం ఇది. స్కూల్లో ఉంచాలా? వద్దా? అని కాదు II: పాటించదు. ఇచ్చిన తీర్మానంలో సంబంధం లేదు
I: తియ్యని స్వరం ఉంటేనే మంచి గాయకులు కాగలరు. మంచి గాయకులను మాత్రమే పిలిచారు. అంటే సమావేశంలోని గాయకులకు తియ్యని స్వరం ఉన్నదని అర్థం II: తియ్యని స్వరం ఉంటేనే మంచి గాయకులు కాగలరు. మంచి గాయకులను మాత్రమే పిలిచారు. అంటే తియ్యని స్వరం లేనివారిని పిలవలేదని అర్థం
I: అసంపూర్ణంగా ఉంది. కాబట్టి బలమైనది కాదు. II: జట్టు బలం/ బలహీనతలకు పోటీ నిర్వహించుటకు సంబంధం లేదు.