శనివారం 08 ఆగస్టు 2020
Nipuna-education - Aug 02, 2020 , 14:21:06

ఈనెల మూడో వారంలో ఎయిర్‌ఫోర్స్ స్టార్ ఎగ్జామ్!

ఈనెల మూడో వారంలో ఎయిర్‌ఫోర్స్ స్టార్ ఎగ్జామ్!

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లోని వివిధ గ్రూపుల్లోని ట్రేడ్‌ల‌లో ఎయిర్ మెన్ ఉద్యోగాల భ‌ర్తీకోసం నిర్వ‌హించే స్టార్ ఎగ్జామ్ ఈ నెల మూడో వారంలో జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తివివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ airmenselection.cdac.inను క్ర‌మం త‌ప్ప‌కుండా చూడాల‌ని అధికారులు సూచించారు. 

స్టార్ ప‌రీక్ష ద్వారా ఎయిర్ ఫోర్స్‌లోని గ్రూప్ ఎక్స్ ట్రేడ్‌, గ్రూప్ వై, ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (పోలీస్‌), ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (సెక్యూరిటీ), మ్యుజీషియ‌న్ ట్రేడుల్లో ఎర్‌మెన్ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప‌రీక్ష‌కు సంబంధించి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం అస‌త్య‌మ‌ని, అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్ర‌మే చూడాల‌ని సూచించారు.


logo