బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nipuna-education - Sep 16, 2020 , 14:37:45

ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌సీఏటీ అడ్మిట్ కార్డుల విడుద‌ల‌

ఎయిర్‌ఫోర్స్ ఏఎఫ్‌సీఏటీ అడ్మిట్ కార్డుల విడుద‌ల‌

న్యూఢిల్లీ: ఎయిర్‌ఫోర్స్ ప్ర‌వేశ‌ప‌రీక్ష ఏఎఫ్‌సీఏటీ అడ్మిట్ కార్డుల‌ను ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ విడుద‌ల చేసింది. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ఈ ప‌రీక్ష వ‌చ్చే నెల 3 నుంచి 5 వ‌ర‌కు జ‌రుగుతుంది. షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు చివ‌ర్లో జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌లు క‌రోనా వ‌ల్ల వాయిదాప‌డ్డాయి.   

ఫ్ల‌యింగ్‌, గ్రౌండ్ డ్యూటీస్‌లో క్లాస్‌-1 గెజిటెడ్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ ప‌రీక్ష‌ను సాధార‌ణంగా ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తారు. ఫిబ్ర‌వ‌రిలో ఒక‌సారి, ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ మ‌రోసారి నిర్వ‌హిస్తారు. క‌రోనా నేప‌థ్యంలో ఈసారి ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష అక్టోబ‌ర్‌కు వాయిదాప‌డింది.  


logo