గురువారం 03 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 05, 2020 , 07:53:16

ఇవాళ 10 గంట‌ల‌కు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు

ఇవాళ 10 గంట‌ల‌కు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు

హైద‌రాబాద్‌: ప‌్ర‌తిష్ఠాత్మ‌క విద్యాసంస్థ‌లైన‌ ఐఐటీల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించిన‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫ‌లితాలు ఈరోజు వెలువ‌డ‌నున్నాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు ఐఐటీ ఢిల్లీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో ఉన్న 13600 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారిలో 96 శాతం మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. దేశ‌వ్యాప్తంగా 222 ప‌ట్ట‌ణాల్లో 1001 కేంద్రాల్లో ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ 27న జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో 1,51,311 మంది విద్యార్థులు పేప‌ర్-1ను, 1,50,900 మంది విద్యార్థులు పేప‌ర్‌-2 రాశారు.    

రేప‌టి నుంచి అడ్మిష‌న్ ప్ర‌క్రియ (జోసా) ప్రారంభ‌మ‌వుతుంది. న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు మొత్తం ఆరు విడుత‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ఉంటుంది.